Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచిత విమానం వద్దనడానికి నేనేమైనా మూర్ఖుడునా? : డోనాల్డ్ ట్రంప్

ఠాగూర్
బుధవారం, 14 మే 2025 (09:04 IST)
ఎవరైనా ఉచితంగా విమానం ఇస్తానంటే వద్దనడానికి నేనేమైనా మూర్ఖుడునా లేదా తెలివితక్కువ వాడినా అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఖతార్ రాజ కుటుంబం నుంచి విలాసవంతమైన బోయింగ్ 747-8 జంబో జెట్‌ను బహుమతిగా ట్రంప్ అందుకోనున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ, ఈ బహుమతిని స్వీకరించడాన్ని ఆయన సమర్థించుకున్నారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ఉచితంగా వస్తున్న ఖరీదైన విమానాన్ని కాదనడం అవివేకమే అవుతుందని వ్యాఖ్యానించారు. 
 
ఈ బహుమతి ద్వారా ఖతార్‌కు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయన్న వాదనలను, అలాగే, భద్రతాపరమైన ఆందోళనలను ఆయన తోసిపుచ్చారు. ఇలాంటి ప్రతిపాదనను నేను ఎప్పటికీ తిరస్కరించను. ఉచితంగా వస్తున్నపుడు వద్దనడానికి నేనేమైనా తెలివితక్కువవాడినా? అని ఆయన ప్రశ్నించారు. 
 
తన అధ్యక్ష పదవీకాలం ముగిశాక ఈ విమానాన్ని వ్యక్తిగతంగా ఉపయోగిస్తారా లేదా అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ, దీనికి బదులుగా డబ్బులు చెల్లించారా ఎంటూ ఎదురు ప్రశ్నించారు. భవిష్యత్‌లో ఈ విమానాన్ని అధ్యక్ష లైబ్రరీ ప్రదర్శనశాలకు విరాళంగా ఇవ్వనున్నట్టు ఆయన ప్రటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments