Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో విద్యార్థుల కిడ్నాప్.. స్కూల్‌పై దాడి చేసి 200 మందిని..?

Webdunia
సోమవారం, 31 మే 2021 (12:07 IST)
నైజీరియాలో విద్యార్థులను ఉగ్రమూకలు కిడ్నాప్ చేశారు. నైజీరియాలోని ఉత్తర నైగర్​ రాష్ట్రంలో ఉన్న‌ ఓ ఇస్లామిక్ పాఠ‌శాలపై దాడిచేసిన‌ దుండ‌గులు విద్యార్థులను కిడ్నాప్ చేశారు.

ఆదివారం టెజీనా న‌గ‌రంలోని సలిహూ తంకో ఇస్లామిక్ పాఠశాలపై సాయుధులైన వ్య‌క్తులు దాడి చేశార‌ని, సుమారు 200 మంది విద్యార్థులను ఎత్తుకెళ్లారని స్థానిక మీడియా సంస్థలు వెల్ల‌డించాయి.

మారణాయుధాలతో వచ్చిన ముష్క‌రులు పాఠశాలపై దాడి చేశారని పోలీస్ అధికారి వసియూ అబియోదిన్​ తెలిపారు. ఈ దాడిలో ఒక వ్యక్తి మృతిచెందారని పేర్కొన్నారు. విద్యార్థులకోసం గాలింపు చర్యలు ప్రారంభించామన్నారు.
 
ఇటీవ‌ల నైజీరియాలోని పాఠ‌శాల‌ల‌పై వ‌రుసగా దాడులు జ‌రుగుతున్నాయి. డ‌బ్బుకోసం దుండ‌గులు స్కూళ్ల‌పై వరుస దాడులకు, కిడ్నాప్​లకు పాల్పడుతున్నారు. గ‌త ఫిబ్ర‌వ‌రిలో జాంఫారా రాష్ట్రంలోని జాంగెబేకు చెందిన ఓ బోర్డింగ్ స్కూలు నుంచి 300 మంది బాలిక‌ల‌ను కిడ్నాప్ చేశారు. 
 
త‌ర్వాత వారిని వ‌దిలేశారు. ఏప్రిల్​ 20న అపహరించిన 14 మంది యూనివర్సిటీ విద్యార్థులను శనివారం విడిచిపెట్టారు. నైజీరియాలో గతేడాది డిసెంబర్ నుంచి కనీసం ఆరుసార్లు ఇలాంటి కిడ్నాప్‌లు జరిగాయని, 700 మందికి పైగా విద్యార్థులు అపహరణకు గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments