Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శరీరానికి టవల్ చుట్టుకుని ఆన్‌లైన్ క్లాస్‌కు రండి.. విద్యార్థినిలతో టీచర్

శరీరానికి టవల్ చుట్టుకుని ఆన్‌లైన్ క్లాస్‌కు రండి.. విద్యార్థినిలతో టీచర్
, సోమవారం, 24 మే 2021 (13:00 IST)
అధ్యాపకుడి బుద్ధి వక్రీకరించింది. తాను చదువు చెప్పే విద్యార్థినిలకు వాట్సాప్‌లో అసభ్య సందేశాలు పంపించి వేధించసాగాడు. ఆన్‌లైన్ క్లాస్‌లను అడ్డుపెట్టుకుని వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నైలోని ప్రముఖ కార్పొరేట్ పాఠశాలలో అకౌంటెన్సీ, బిజినెస్ స్ట‌డీస్ బోధించే రాజ‌గోపాలన్ బుద్ధివ‌క్రీకరించి విద్యార్ధుల‌ను లైంగికంగా వేధిస్తూ వారికి వాట్సాప్‌లో అభ్యంత‌ర‌క‌ర మెసేజ్‌లు పంపసాగాడు. దీనిపై విద్యార్థినిలు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి, ఆ తర్వాత పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. 
 
ముఖ్యంగా లైంగిక వాంఛ‌ల‌తో రగిలిపోయే రాజ‌గోపాల‌న్ అదే తీరుతో విద్యార్థినీ, విద్యార్దుల‌తో ప్రవర్తించసాగాడు. ట‌వ‌ల్‌తో ఆన్‌లైన్ క్లాసుల‌కు హాజ‌ర‌య్యే రాజ‌గోపాల‌న్ స్టూడెంట్స్‌ను కూడా ట‌వ‌ల్ ధ‌రించాల‌ని కోరేవాడ‌ని, ప‌లువురు విద్యార్థినుల‌ శరీరాల‌ అందాల గురించి వాట్సాప్ మెసేజ్‌ల్లో అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసేవాడ‌ని పోస్టుల్లో స్ప‌ష్టం చేశారు. 
 
మ‌రోవైపు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న టీచ‌ర్‌ను త‌క్ష‌ణ‌మే విధుల నుంచి తొల‌గించాల‌ని సంస్థ డీన్‌కు స్కూల్ సిబ్బంది లేఖ రాశారు. ఇక ఆఫ్‌లైన్ క్లాసుల్లోనూ రాజ‌గోపాలన్ విద్యార్ధినుల‌ ప‌ట్ల అస‌భ్యంగా వ్య‌వహ‌రించేవాడ‌ని ఆరోప‌ణ‌లున్నాయి. విద్యార్థినుల‌ను అభ్యంత‌ర‌క‌రంగా తాక‌డం, వారిపై లైంగిక వేధింపుల‌కు గురిచేసేలా వ్యాఖ్యానిస్తాడ‌ని చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా పాజిటివ్ రోగులను గుర్తించే శునకాలు