Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో భారీ భూకంపం - 30 మంది మృత్యువాత

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (21:52 IST)
చైనాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో గృహాలు ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. ఈ భూకంప ప్రకంపనలు భూకంప లేఖినిపై దాదాపు 6.6గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 
 
ఈ భూకంప కేంద్రానికి సచువాన్ ప్రావిన్స్‌ కాంగ్ డింగ్ నగరానికి నైరుతి దిక్కున 43 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది. ఈ భూ ప్రకంపనలు రాజధాని ప్రాంతమైన చెంగ్డు నగరంలో కూడా కనిపించాయి. ఈ ప్రాంతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్డౌన్ అమలవుతుంది. 
 
ఈ పరిస్థితుల్లో భూకంపం సంభవించడంతో దాదాపు 10 వేల మంది వరకు ప్రభావితులయ్యారని చైనా ప్రభుత్వ అధికారిక టీవీ వెల్లడించింది. విద్యుత్, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చైనా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments