Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు సందేశం ఇవ్వడం కోసం కొబ్బరి చెట్టెక్కి ప్రసంగించిన శ్రీలంక మంత్రి

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (22:26 IST)
శ్రీలంక మంత్రి అరుందిక పెర్నాండో ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. దేశంలో కొబ్బరికాయ కొరత ఉందని ఆ లోటును అధికమించాల్సి ఉందని సందేశాన్ని రైతులకు ఇవ్వడం కోసం కొబ్బరి చెట్టెక్కి ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతు న్నాయి.
 
శ్రీలంకలో కొబ్బరికాయలకు అత్యధికంగా డిమాండు ఏర్పడ్డాయి. 700 మిలియన్ల కొబ్బరికాయలు లోటు ఏర్పడిందని తెలిపారు. స్థానిక పరిశ్రమ దేశీయ అవసరాల కోసం కొబ్బరికాయల వినియోగం పెరిగినందున డిమాండు ఏర్పడిందని పేర్కొన్నారు. అందుకే అందుబాటులో ఉన్న ప్రతి ఖాలీ స్థలంలో కొబ్బరి పంట సాగు చేయాలని రైతులకు పెర్నాండో పిలుపునిచ్చారు.
 
కొబ్బరి పంటలను విస్తృతంగా సాగుచేసి పరిశ్రమకు దన్నుగా నిలవడమే కాకుండా దేశానికి విదేశీ మారకద్రవ్యం అర్జించడంలో తోడ్పాటు అందించాలని సూచించారు. కాగా పెర్నాండో కొబ్బరి చెట్లు ఎక్కేందుకు ఉపయోగించే ఆధునిక పరికరం సాయంతో చెట్లు ఎక్కారు. దాంతో ఓ చేతిలో కొబ్బరికాయతో ఆయన ప్రసంగించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments