Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈస్టర్ సండే పేలుళ్లు : 310కి చేరిన మృతులు... 40 మంది అనుమానితుల అరెస్టు

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (11:40 IST)
శ్రీలంకలో ఈస్టర్ సండే రోజున వరుస బాంబు పేలుళ్లు జరుగగా, ఈ పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారానికి 310కి చేరింది. ఈ పేలుళ్ళలో గాయపడిన క్షతగాత్రుల్లో అనేకమంది పరిస్థితి మరింత విషమంగా ఉంది. ఇకపోతే, ఈ పేలుళ్ళకు సూత్రధారులుగా భావిస్తున్న 40 మంది అనుమానితులను శ్రీలంక భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరంతా శ్రీలంక జాతీయులే కావడం గమనార్హం. 
 
మరోవైపు, సోమవారం అర్థరాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. దీంతో భద్రతా బలగాలు ఆ దేశంలోని ప్రతి అంగుళాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇంకోవైపు, విదేశీ దౌత్యవేత్తలు, హైకమిషనర్లతో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన భేటీకానున్నారు. ఈ సందర్భంగా పేలుళ్ళ గురించి వారికి వివరించడమే కాకుండా అంతర్జాతీయ దౌత్య సహకారాన్ని ఆయన కోరనున్నారు. 
 
ఇదిలావంటే, ఈ పేలుళ్ళ వెనుక ఐసిస్ హస్తమున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు అనుమానితుల ఛాయాచిత్రాలను విడుదల చేసింది. అంతేకాకుండా, స్థానిత తీవ్రవాద సంస్థకు ఐసిస్ ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఈ పేలుళ్ళపై శ్రీలంక అంతర్జాతీయ దర్యాప్తును కోరే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments