Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేదికపైనే అగ్నికి ఆహుతైన గాయని.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (09:52 IST)
ఓ గాయని వేదికపైనే అగ్నికి ఆహుతైంది. ఈ విషాదకర ఘటన స్పెయిన్‌లో సంభవించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రముఖ స్పానిష్‌ పాప్‌స్టార్‌, డాన్సర్‌ జోయానా సెయిన్స్‌లు కలిసి సూపర్ హాలీవుడ్ ఆర్కెస్ట్రా  బృందంతో సంగీత విభావరి కార్యక్రమంలో పాల్గొన్నారు. అపుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా బాణాసంచా పేలిపోయింది. దీంతో వేదికకు మంటలు అందుకుని గాయని సజీవదహనమైంది.
 
ఈ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం మేరకు... బాణాసంచా కాల్చుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ రెండు రాకెట్లు వేదికపై దూసుకు వచ్చాయి. ఒకటి ఏకంగా ఆమె కడుపులోకి దూసుకుపోయింది. దీంతో వేదిక మీద ఒక్కసారిగా పేలుడు, సంభవించి మంటలంటుకోవడంతో ఆ మంటల్లో జోయానా చిక్కుకు పోయారు. 
 
అపస్మారక స్థితిలోకి జారుకున్న ఆమెను ఆసుపత్రికి తరలించే సమయానికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేస నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. జోయానా ఆకస్మిక మరణంపై గ్రూప్‌ ప్రమోటర్లు, హాలీవుడ్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments