Webdunia - Bharat's app for daily news and videos

Install App

గగనతలంలోని విమానంలో కొట్లాట... ఒకరికి కాలు విరిగింది కూడా..

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (13:07 IST)
సాధారణంగా ఆర్టీసీ బస్సులు, రైళ్ళలో సీట్ల కోసం కొట్లాడుకోవడం చూస్తుంటాం. కానీ, గాల్లో ఎగిరే విమానంలో కూడా ఇదే తంతు జరిగింది. అమెరికాలోని న్యూయార్క్ సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు 320 మంది ప్రయాణికులతో టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానమొకటి బయలుదేరింది. మరో గంటలో గమ్యస్థానానికి చేరుకోవాల్సివుంది. విమానంలో ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది. 
 
దీంతో ప్రయాణికులంతా రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకరిపై మరొకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఈ దాడిలో ఒక్కసారిగా విమానంలో హాహాకారాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో విమానాన్ని పైలట్ న్యూయార్క్‌లోని కెన్నడీ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశాడు. 
 
కాగా, ఈ ఘర్షణలో 32 మందికి గాయాలు కాగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి కాలు విరిగింది. దీంతో అధికారులు వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. 
 
ఈ ఘటనపై న్యూయార్క్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికార ప్రతినిధి స్టీవ్‌ కోల్‌మన్‌ మాట్లాడుతూ.. ది బోయింగ్‌ 777 విమానం 326 ప్రయాణికులు, 21 మంది సిబ్బందితో ఇస్తాంబుల్‌ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరింది. విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యే 45 నిమిషాల మందు విమానంలో భయానక పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.
 
గొడవ పడుతున్న వారిని చూసి మిగతా ప్రయాణికులు కూడా ఆందోళన చెందారు. మొత్తం 32 మంది గాయపడగా.. వారిలో కొందరిని అధికారులు చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటన వల్ల ఇతర విమానాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని ఆయన వివరించారు. కాగా, ఈ ఘటనలో ఓ వ్యక్తి కాలు విరిగినట్టు సమాచారం. గాయపడినవారిలో ఓ చిన్నారి కూడా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments