Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమానంలో సిగ్గు లేకుండా ఫ్యాంటు విప్పేసిన మేల్ ప్యాసింజర్... వైరల్‌ అయిన ట్వీట్

Advertiesment
విమానంలో సిగ్గు లేకుండా ఫ్యాంటు విప్పేసిన మేల్ ప్యాసింజర్... వైరల్‌ అయిన ట్వీట్
, సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (15:51 IST)
కొంతమంది ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ.. మానసికంగా మాత్రం చిన్నపిల్లల్లానే ప్రవర్తిస్తుంటారు. ఫలితంగా వారి చర్యలకు ఇతరులు జడుసుకునే పరిస్థితులు ఉత్పన్నమవుతుంటాయి. తాజాగా ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు చేసిన పనులకు ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. ఏమాత్రం సిగ్గు అనేది లేకుండా అందరి ముందు ఫ్యాంటి విప్పేశాడు. ఈ చర్యతో తీవ్ర అసౌకర్యానికి గురైన ఓ మహిళా ప్యాసించర్ తన ట్విట్టర్ ఖాతాలో తన బాధను వెల్లడించింది. దీంతో ఆమెకు నెటిజన్లు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. 
 
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ విషయాలను పరిశీలిస్తే, ఎయిర్‌ ఫ్రాన్స్‌ విమానంలో లిజ్జి థాంప్సన్‌ అనే యువతి ప్రయాణం చేసింది. ఈమె సీటు పక్కనే మరో వ్యక్తి కూర్చొన్నాడు. విమానం గగనంలో ప్రయాణిస్తుండగా, ప్రయాణంలో ఉన్నామనే సోయి మరిచి ఆ వ్యక్తి సిగ్గు లేకుండా అందరి ముందు ప్యాంట్‌ విప్పి బాక్సర్‌ షాట్‌ మీద తిరగాడని, షూస్‌, సాక్స్‌ తీసేశాడని తెలిపింది. ఈ చర్యలతో ఆ వ్యక్తి పక్క సీటులోనే ఉన్నా తాను తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని పేర్కొంది.
 
ఆ వ్యక్తి అంతటితో ఆగకుండా బిగ్గరగా అరవడం మొదలు పెట్టాడనీ, వచ్చి పక్కన కూర్చోవాలన్నాడని తెలిపింది. ఇంత జరగుతున్నా ఫ్లైట్‌ సిబ్బంది పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేసింది. ఆ తర్వాతే తానే సీటు మార్చుకున్నానని చెప్పుకొచ్చింది. ఆమె ట్వీట్లకు నెటిజన్లు భారీస్థాయిలో స్పందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్మీ మేజర్ అలా మరణిస్తే.. భార్య ఏం చేసిందో తెలుసా?