Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము పడకగదిలోకి వస్తే.. ఇంకేమైనా వుందా..?

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (14:17 IST)
పాము అంటేనే ఆమడ దూరం పారిపోతాం. అలాంటిది ఆ పాము పడకగదిలోకి వస్తే.. ఇంకేమైనా వుందా.. అంతే గుండె ఆగిపోతుంది. అలాంటి ఘటనే సింగపూరులో చోటుచేసుకుంది. పడక గదిలో నాగుపాము ఉందని, రక్షించండి అంటూ రెస్క్యూ టీమ్‌కు ఓ మహిళ ఫోన్ చేసిన వింత ఘటన సింగపూర్ దేశంలో వెలుగుచూసింది. 
 
తన పడకగదిలో మంచం దగ్గర ఉన్న అల్మారాలో నాగుపాము ఉందని, పాము హిస్సింగ్ శబ్ధం వినిపిస్తుందని, దీన్ని రికార్డు చేసి పంపించి, తనను పాము బారి నుంచి కాపాడాలని కోరుతూ సింగపూర్ దేశానికి చెందిన జియాన్ అనే మహిళ రెస్క్యూ హాట్ లైన్‌కు ఏడుస్తూ ఫోన్ చేసింది. 
 
సింగపూర్ రెస్క్యూ టీం ఆఫీసర్ ముహమ్మద్ సఫారీ బిన్ మస్నోర్ హుటాహుటిన మహిళ ఉన్న బెడ్రూంలోకి వచ్చి చూడగా బాత్రూంలో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఆన్ చేసి ఉండటం కనిపించింది. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ను స్విచ్ ఆఫ్ చేయడంతో పాములా వచ్చిన హిస్సింగ్ శబ్ధం ఆగిపోయింది. 
 
ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ నుంచి శబ్ధం పాము చేసే శబ్ధంలా అనిపించడంతో మహిళ నాగుపాము పడకగదిలో ఉందని భయపడి ఏడుస్తూ ఫోన్ చేసింది.బెడ్రూంలో నాగుపాము లేకపోవడంతో మహిళతో సహా రెస్క్యూ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments