Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపుడూ తాడేప‌ల్లిలోనే కాదు... తాళి క‌ట్టు శుభ‌వేళ‌కూ సీఎం జ‌గ‌న్!

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (13:58 IST)
ఏపీ సీఎం ఎపుడూ తాడేప‌ల్లిలోనే ఉంటారు...అస‌లు బ‌య‌ట‌కు కాలు పెట్ట‌డు... అనేది ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌. ఎంత సేపూ ఆన్ లైన్ లో ప‌థ‌కాల స‌మీక్ష‌, వీలైతే... ఒక్క మీట నొక్కి ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డ‌బ్బు పంపిణీ... ఇది త‌ప్ప ఆయ‌న ద‌ర్శ‌నాలు బ‌య‌ట ఎక్క‌డ అని ప్ర‌శ్నిస్తుంటారు.

కానీ, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్ట్రాట‌జీనే డిఫ‌రెంట్. ఆయ‌న ఎప్పుడు ఎక్క‌డ‌కి రావాల‌నేది అంతా సూప‌ర్ ప్లానింగ్. గ‌త సీఎం చంద్ర‌బాబులా ప్ర‌తి చిన్న దానికి ఆయ‌న టూర్లు చేయ‌రు. జిల్లా క‌లెక్ట‌ర్లు, ఇత‌ర ఉన్న‌తాధికారుల అడ్రినిస్ట్రేష‌న్లో త‌ల దూర్చ‌రు. చివ‌రికి శానిటేష‌న్ ప‌నుల‌కు కూడా ఏపీ సీఎంగా నారా చంద్ర‌బాబు నాయుడు గ‌తంలో హాజ‌ర‌యిపోయేవారు. అంతా తానై విధుల్ని న‌డిపిస్తున్న‌ట్లు భావించేవారు.

కానీ, ఏపీ న‌వ‌, యువ‌ సీఎం జ‌గ‌న్ మాత్రం అంతా త‌న ప్లానింగ్ ద్వారానే ప్రోగ్రామింగ్ చేసుకుంటారు. ప‌థ‌కాల అమ‌లు, కింది స్థాయి విధుల నిర్వ‌హ‌ణ‌లో జిల్లా యంత్రాంగాలు ప‌నిచేయాల‌నేది ఆయ‌న భావ‌న‌. అందుకే ఆయ‌న అంతా తాడేప‌ల్లిలో కూర్చునే అడ్మినిస్ట్రేష‌న్ కింది స్థాయిలో సూప‌ర్ విజ‌న్ చేస్తారు. ఆయ‌న కేవ‌లం తాడేపల్లి త‌న క్యాంపు కార్యాల‌యానికే ప‌రిమితం అయిపోయార‌నే వాద‌న ప్ర‌తిప‌క్షాల‌ద‌ని, ప్ర‌తి చిన్న కార్య‌క్ర‌మానికి సీఎం ఎందుకుని ఆయ‌న పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

త‌న హాజ‌రు అవ‌స‌రం అయిన ప్ర‌తి చిన్న ఫంక్ష‌న్ కి కూడా సీఎం వ‌స్తార‌నేదానికి ఉదాహ‌ర‌ణ‌... నేడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సీఎం ప‌ర్య‌ట‌నే అని చెపుతున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు కుమార్తె వివాహ వేడుకకు సీఎం వైయస్. జగన్ హాజ‌ర‌య్యారు. వధువు స్నిగ్ధ, వరుడు హనీష్ లను ఆశీర్వదించారు. పశ్చిమ గోదావరి జిల్లా బీమవరం కే కన్వెన్షన్ కళ్యాణ మండపంలో శనివారం ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ మహోత్సవానికి ఇలా సీఎం హాజరై వధూవరులను ఆశీర్వదించి వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

తర్వాతి కథనం
Show comments