Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలికి రూ.900 కోట్ల ఆస్తిని వదిలి వెళ్లిన బెర్లుస్కోని ప్రధాని

Webdunia
సోమవారం, 10 జులై 2023 (09:46 IST)
ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని తన ప్రియురాలికి ఏకంగా రూ.900 కోట్ల విలువ చేసే ఆస్తిని వదిలి వెళ్లారు. ఈయన గత నెలలో తుదిశ్వాస విడిచారు. 86 యేళ్ల బెర్లుస్కోని లుకేమియాతో బాధపడుతూ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. అయితే, బెర్లుస్కోనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇపుడు వెలుగులోకి వచ్చింది. 
 
బెర్లుస్కోని గత కొంతకాలంగా మార్తా ఫాసినా అనే 33 యేళ్ల మహిళతో ప్రేమాయణం సాగిస్తూ వచ్చారు. ఇద్దరి మధ్య 53 యేళ్ళ వయోభేదం ఉన్నప్పటికీ బెర్లుస్కోని వయసును ఏమాత్రం పట్టించుకోకుండా ప్రేమ కొనసాగిస్తూ వచ్చారు. అదేసమయంలో ఆయన లుకేమియా వ్యాధితో బాధపడుతూ వచ్చారు. ఈ క్రమంలో తన ప్రియురాలికి ఏకంగా రూ.900 కోట్ల విలువ చేసే ఆస్తిని రాశారని, ఆ మేరకు వీలునామాలో పేర్కొన్నారంటూ ప్రఖ్యాత మీడియా సంస్థ బ్లూంబెర్గ్ వెల్లడించింది.
 
ఇటలీ కుబేరుల్లో ఒకరైన బెర్లుస్కోని మొత్తం సంపద విలువ రూ.4.6 లక్షల కోట్లు. అందులో రూ.900 కోట్లు రాసివ్వడం పెద్ద విషయం కాదని పలువురు అంటున్నారు. అయితే, ఫాసినాకు మాత్రం ఇది ఊహించని బొనాంజానే. మాజీ ప్రధానితో ఆమె డేటింగ్ చేసినందుకు ఏకంగా రూ.900 కోట్ల ఆస్తి సమకూరింది. ఫాసినా కూడా ఓ రాజకీయ నాయకురాలే కావడం గమనార్హం. ఇటలీ చాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లో ఆమె 2018 నుంచి సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments