Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికినీలో ఆమె అందాలను చూసి పంది 'ఫిదా'... ఏం చేసిందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (14:43 IST)
సాధారణంగా మోడల్‌లు సముద్ర తీరంలో బికినీలో ఫోటో షూట్ చేస్తుంటారు. అలాగే విదేశాలలో ఉన్న బీచ్‌లలో చాలామంది బికినీలతో దర్శనమిస్తుంటారు. అయితే అభిమానులు కొన్ని సందర్భాల్లో వారిపై పడి వాళ్లకు చిరాకు తెప్పిస్తుంటారు. తాజాగా జరిగిన ఒక సంఘటన అందరినీ కడుపుబ్బా నవ్వుకునేలా చేసింది.
 
వెనెజులాకి చెందిన మిచెల్లీ లెవిన్ అనే 32 ఏళ్ల ఫిట్‌నెస్ మోడల్ బహమాస్‌లో గల బిగ్ మేజర్ కే ద్వీపంలో బికినీ ఫోటో షూట్‌లో పాల్గొంటోంది. అయితే ఆ ప్రాంతంలో పందులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఆ పందుల గుంపు ద్వీపం చుట్టూ ఉన్న నీళ్లలో ఈత కొడుతూ, వచ్చేపోయే టూరిస్ట్‌లను ఆకర్షిస్తూ ఉండేవి. అంతేకాకుండా వచ్చిన సందర్శకులు సైతం వాటితో ఫోటోలు తీసుకునేవారట.
 
మిచెల్లీ బికినీ ఫోటో షూట్‌లో పాల్గొంటున్న సమయంలో పందుల గుంపు ఒకటి ఆమె వైపుకు వేగంగా వచ్చాయట. వాటిని చూసి పరుగు పెట్టినప్పటికీ, అందులో భారీ ఆకారంలో ఉన్న పంది ఒకటి ఆమె ధరించిన బికినీ కుడివైపు ప్రదేశాన్ని బాగా గాయపరిచింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోని లెవిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, కేవలం ఒక్క రోజులో దాదాపు 5 మిలియన్ వ్యూస్ వచ్చాయట. ఈ ఘటనను చూసిన కొందరు నెటిజన్లు... పంది మీ అందానికి ఫిదా అయి అలా చేసి వుంటుందిలే అని సెటైర్లు పేలుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments