Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పైన పాక్ పన్నాగానికి చెక్, ఆ దేశాలు అడ్డుకున్నాయి

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (13:00 IST)
ప్రపంచ వేదికపై భారత్‌ను ఇబ్బందికి గురిచేయాలనే ప్రయత్నాలు జరిపే పాకిస్థాన్‌కు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కొందరు భారతీయులను పాక్ తీవ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా అందుకు భద్రతా మండలి చెక్ పెట్టింది.
 
కొందరు భారతీయులను ఉగ్ర వాదులుగా చిత్రీకరిస్తూ పాకిస్థాన్ ఐరాస తీవ్రవాద నిరోధక కమిటీ ముందు పేర్లను ఉంచిందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి తెలిపారు. విదేశాలల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారిపై అనుమానాలను వ్యక్తం చేస్తూ వారిని తీవ్రవాదులు జాబితాలో చేర్చాలని చెప్పింది. చివరకు ఆ ఆరోపణలపై భద్రతా మండలికి పాకిస్థాన్ ఆధారాలు ఇవ్వలేకపోయింది.
 
దీంతో పాకిస్థాన్ చర్యను అమెరికా సహా బ్రిటన్, ప్రాన్స్, జర్మనీ, బెల్జియం అడ్డుకున్నాయి. కాగా భారత్ పైన పాక్ ఇటువంటి కుట్రను పన్నడం కొత్త విషయం కాదని తెలిపింది. ఇద్దరు భారతీయులను తీవ్రవాద జాబితాలో చేర్చాలని గత ఏడాది కూడా ప్రయత్నాలు జరపగా అవి కూడా ఫలించలేదు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments