Webdunia - Bharat's app for daily news and videos

Install App

హన్మకొండలో మహిళ దారుణ హత్య, పోలీసు స్టేషన్ దగ్గరలోనే జరిగిన దుర్ఘటన

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (12:48 IST)
హన్మకొండలో దారుణ హత్య జరిగింది. పోలీసు స్టేషను కూతవేటు దూరంలోనే ఈ  సంఘటన జరగడం అందర్ని ఆందోళనకు గురిచేస్తోంది. హన్మకొండ టైలర్ స్ట్రీట్‌లో దోరం శారద అనే మహిళ కూరగాయలు విక్రయించుకుంటూ కుమారుడితో కలిసి జీవనం గడుపుతోంది. కొంత కాలం క్రితం భర్తతో గొడవపడి విడిగా ఉంటున్న శారదను గుర్తు తెలియని అగంతకులు హతమార్చారు.
 
ఆమెతో పాటు ఆమె కుమారుడిని కూడా తీవ్రంగా గాయపరిచారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో వారిపై విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చారు. శారద తలకు బలమైన గాయాలు కావడంతో శారద అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె కుమారుడు అఖిలేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
 
పోలీసు స్టేషనుకు అతి దగ్గర దూరంలో ఈ ఘటన జరగడంతో హన్మకొండలో విషయం చర్చాంశనీయంగా మారింది. వారిపై దాడికి తెగబడిన వారి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే శారద కుమారుడు తీవ్ర గాయాల పాలై ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో పోలీసులు అతడిని ఎంజీంఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికక్కడ చికిత్స జరుగుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments