బంగారు వర్ణం కవచంతో తాబేలు ... దేవుని అవతారమా?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (14:06 IST)
నేపాల్‌లో ఓ అరుదైన తాబేలు కనిపించింది. ఈ తాబేలు కవచం బంగారు వర్ణంతో ఉంది. అంటే.. ఆ తాబేలు బంగారు కవచంతో పుట్టింది. దీంతో ప్రతి ఒక్కరూ దీన్ని దేవుని అవతారంగా భావించి, పూజిస్తున్నారు. ఈ దృశ్యం నేపాల్ దేశంలో కనిపించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నేపాల్‌ దేశంలోని ధ‌నుషా జిల్లాలో భాగమైన ధనుషాధమ్ మున్సిపాలిటీలో ఓ తాబేలు బంగారు కవచంతో ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో ఇది దేవుడి అవతారంగా భావించి పూజలు చేయడం ప్రారంభించారు. 
 
మరోవైపు, మిథిలా వైల్డ్‌లైప్ ట్రస్ట్ మాత్రం దీన్ని భారతీయ ఫ్లాప్ షెల్ తాబేలుగా గుర్తించింది. కానీ, క‌మ‌ల్ దేవ్‌కోట అనే స‌రీసృపాల నిపుణుడు ఈ తాబేలుకు అధ్యాత్మిక ప్రాముఖ్య‌త ఉంద‌ని చెప్పుకొచ్చారు. దీనిమీద డాక్యుమెంట్ కూడా చేశారు. 
 
నేపాల్‌లో తాబేళ్ల‌కు మ‌త‌, సాంస్కృతిక విలువ‌లున్నాయ‌ని చెప్పారు. విశ్వాన్ని విధ్వంసం నుంచి కాపాడటానికి విష్ణువు తాబేలు రూపాన్ని తీసుకున్నాడని చాలామంది నమ్ముతున్నారంటున్నారు. తాబేలుగా ఉన్న‌ప్పుడు విష్ణువుని భార‌తీయ పురాణాల‌లో కుర్మావతారంగా అని పిలుస్తారు.
 
ఈ జీవిని నేపాల్‌లోనే కాదు భార‌త‌దేశం అంత‌టా దేవాల‌యాల్లో పూజిస్తారు. తాబేలు పైనున్న షెల్‌ను ఆకాశాన్ని, కిందున్న షెల్‌ను భూమిని సూచిస్తుంద‌ని దేవ్‌కోట అంటున్నారు. నిపుణులు అభిప్రాయం ప్ర‌కారం క్రోమాటిక్ లూసిజం వ‌ల్ల తాబేలుకు మెరిసే షెల్ వ‌చ్చిందంటున్నారు. 
 
ఈ లూసిజం తెలుపు, లేత‌, పాచీ రంగులో ఉంటుంది. మ‌రోమాట‌లో చెప్పాలంటే ఇది జంతువుల‌లో రంగు వ‌ర్ణ‌ద్ర‌వ్యం కోల్పోతుంది. అయితే, ఈ తాబేలు విషయంలో లూసిజం గ్జాంతోఫోర్స్‌ ఆధిపత్యానికి దారితీసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న జాతుల‌లో ఈ తాబేలు ఐదవది. ఇది నేపాల్‌లోనే మొద‌టి రికార్డు. ఈ తాబేలు జన్యుపరివర్తన కారణంగా అలా జన్మించివుంటుందని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments