Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టినరోజు నాడు పక్షిలా ఎగరాలనుకుంది..చివరకు ఏమైందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (17:26 IST)
సాధారణంగా మనకు పుట్టినరోజు వచ్చిందంటే ఏ గుడికో, ఇష్టమైన ప్రదేశానికో, స్నేహితులతో షికారుకో వెళ్తాము. కొత్త కోరికలను నెరవేర్చుకోవడానికి తపన పడుతుంటాము. కానీ ఆ కోరికే ప్రాణాలు తీసిన విషాదం ఒకటి మెక్సికోలో జరిగింది. అది కూడా పుట్టిన రోజునే కావటం మరో విషాదం. వెనెస్సా కార్డేనాస్‌ అనే యువతి తన 18వ పుట్టిన రోజును భిన్నంగా జరుపుకోవాలని భావించి ప్రాణాలను పోగొట్టుకుంది. 
 
తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. మార్చి 24వ తేదీన తన పుట్టిన రోజు జరుపుకున్న వెనెస్సా కార్డేనాస్‌ ఏదైనా సరికొత్తగా చేయాలని భావించిన ఆమె తనకు ఎంతో ఇష్టమైన స్కైడైవింగ్ చేయాలనుకుంది. అందుకోసం ఎలాగోలా అమ్మానాన్నలకు ఒప్పించింది. స్కైడైవింగ్ ఇన్‌స్ట్రక్టర్‌ కాస్టిల్లోతో కలిసి ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కింది. మొరెలస్ వద్దకు రాగానే కాస్టిల్లోతో కలిసి విమానం నుంచి బయటకు దూకేసింది. కాగా ఆ సమయానికి పారాచూట్ తెరుచుకోకపోవడంతో ఇద్దరూ 1,300 అడుగుల ఎత్తు నుంచి కిందకి పడిపోయి దారుణంగా చనిపోయారు. 
 
వారు కిందికి పడిపోతున్న విషయాన్ని గుర్తించని వెనెస్సా కార్డేనాస్‌ తల్లిదండ్రులు..గ్రౌండ్ సిబ్బంది వారితో పాటు విమానం నుంచి దూకిన ముగ్గురు స్కైడైవర్స్ పారాచూట్‌లతో సురక్షితంగా కిందికి దిగడంతో షాకయ్యారు. కానీ కొంతసేపటికి దూరంగా ఆమె గాల్లో నుంచి కింద పడటం చూసి షాకయ్యారు. పుట్టిన రోజునే కన్నబిడ్డ కళ్లముందే చనిపోవటంతో వెనెస్సా కార్డేనాస్‌ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments