Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలవంతంగా ఆ సింగర్‌ను కౌగిలించుకుంది.. రెండేళ్ల జైలు తప్పదా..? గేమ్స్‌పై నిషేధం..

గల్ఫ్ దేశాల్లో నిబంధనలు ఎంత కఠినతరంగా వుంటాయి. ఇరాకీ సింగర్ మజిద్ ఆల్ ముహాన్ దిన్ ముహాన్ దిన్‌ను కౌగిలించుకున్న యువతికి రెండేళ్ల జైలు శిక్ష రూ.18 లక్షల జరిమానాను విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇర

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (17:03 IST)
గల్ఫ్ దేశాల్లో నిబంధనలు ఎంత కఠినతరంగా వుంటాయి. ఇరాకీ సింగర్ మజిద్ ఆల్ ముహాన్ దిన్ ముహాన్ దిన్‌ను కౌగిలించుకున్న యువతికి రెండేళ్ల జైలు శిక్ష రూ.18 లక్షల జరిమానాను విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇరాకీ సింగర్ మజిద్ ఆల్ ముహాన్ దిన్‌కు గల్ఫ్ దేశాల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో రియాద్‌లో రెండు రోజుల క్రితం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముహాన్ దిన్ అద్భుతంగా పాడారు. 
 
ఈ కార్యక్రమానికి హాజరైన బురఖా ధరించిన ఓ యువతి ఆ పాటలను ఎంతో ఆస్వాదించింది. సంతోషం పట్టలేక వేదికపైకి వెళ్లి సింగర్ ముహాన్ దిన్ ని కౌగిలించుకుంది. అంతే అప్రమత్తమైన సిబ్బంది అక్కడి నుంచి తీసుకెళ్లి.. పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు సింగర్‌ను బలవంతంగా కౌగిలించుకుందనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆ యువతికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.18 లక్షల జరిమానాను కోర్టు విధించే అవకాశం వుందని తెలుస్తోంది. 
 
ఇదిలా ఉంటే.. సౌదీలో పాపులర్ వీడియో గేమ్‌లపై నిషేధం విధించారు. పిల్లల మరణానికి కారణమయ్యే గేమ్స్‌ను సౌదీ జనరల్ కమిషన్ నిషేధించింది. ఆన్‌లైన్ గేమ్‌ల ద్వారా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో 47 వీడియో గేమ్‌లపై నిషేధం విధించినట్లు సౌదీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments