Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీలో కేరళ వాసుల హత్య... ముగ్గురికి బహిరంగ శిరచ్ఛేదం

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (09:21 IST)
కేరళ రాష్ట్రానికి చెందిన ఐదుగురుని చిత్రహింసలకుగురిచేసి సజీవంగా పాతిపెట్టిన కేసులో దోషులుగా తేలిన ముగ్గురికి బహిరంగ శిరచ్ఛేద శిక్షను సౌదీ ప్రభుత్వం అమలు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గత 2014లో ఒక సౌదీ అరేబియా రైతు తన వ్యవసాయ భూమిలో పైపులను భూమిలో వేసేందుకు తవ్వుతుండగా కొన్ని ఎముకలు బయటపడ్డాయి. తొలుత జంతువుల ఎముకలుగా భావించారు. ఆ తర్వాత అస్థిపంజరం లభించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన సౌదీ పౌలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో మరో నాలుగు అస్థిపంజరాలు లభించాయి. అందులో కొందరి నోటికి టేపులు చుట్టి, కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి ఉండటం గమనించారు.
 
అస్థిపంజరాల సమీపంలో లభ్యమైన వీసా కార్డు ఆధారంగా మరింత లోకుగా దర్యాప్తు చేపట్టగా మృతులంతా కేరళ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. తన కూతురు, మరో మహిళను వేధించినందుకుగానూ ఒక సౌదీ యజమాని వారిని చిత్రహింసలకు గురిచేసి సజీవంగా పాతిపెట్టినట్లు ఈ దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసులో మొత్తం 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా, వీరిలో ముగ్గురిని కోర్టు దోషులుగా తేల్చి మరణశిక్షను విధించింది. ఫలితంగా ఈ ముగ్గురికి ఖతీఫ్‌ పట్టణంలో బహిరంగంగా శిరచ్ఛేదం చేసి మరణశిక్ష అమలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments