Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మహిళతో లింకు పెట్టుకుని నన్ను పట్టించుకోవడం లేదు : సీఐపై భార్య కేసు

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (08:59 IST)
ఓ కేసు విచారణ నిమిత్తం స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత మొదటి భార్యకు తెలియకుండా ఆ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కట్టుకున్న భార్యతో పాటు.. పిల్లలను నిర్లక్ష్యం చేయసాగాడు. దీనిపై భార్య సీఐపై కేసు పెట్టింది. హైదరాబాద్‌ నగరంలోని కొత్తపేటలో వెలుగుచూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కొలకపల్లి రాజయ్య తాండూరు కొరణ్‌కోటలో ఎస్ఐగా ఉన్న సమయంలో ఓ కేసు విషయంలో ఓ మహిళ ఠాణాకు వచ్చింది. ఆ మహిళతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఎవరికీ తెలియకుండా 2009 మే 10వ తేదీన యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి తొలి భార్య రేణుకను, ముగ్గురు పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. 
 
ఈ విషయం తెలిసిన రేణుక ఆగ్రహంతో భర్తను నిలదీసింది. అయితే, ఖాకీ పవర్ ముందు ఆమె బలం చాల్లేదు. దీంతో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌కు సోమవారం ఫిర్యాదు చేసింది. ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భర్త... తనను, తన ముగ్గురు పిల్లల్ని వదిలేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఆ తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ, అంతకుముందే శ్రీవాణి అనే మహిళను రాజయ్య పెళ్లి చేసుకుని ఆమెకు దూరంగా ఉన్నాడని పేర్కొంది. ప్రస్తుతం రీటా అనే యువతితో మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని వాపోయింది. ఈ విషయమై నిలదీస్తే.. పోలీసు శాఖలో ఉన్న తనను ఏమీ చేయలేరనీ, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరిస్తున్నట్లు తెలిపింది. రేణుక ఫిర్యాదుతో రాజయ్యపై సరూర్‌నగర్‌ మహిళా పీఎస్‌లో కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments