Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెమెరామెన్‌ను రక్షించబోయి మంత్రి మృతి.. నీటిలో పడిపోతే..?

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (23:20 IST)
minister
ఓ కెమెరామెన్‌ను రక్షించబోయి ఓ మంత్రి ప్రాణాలు కోల్పోయిన విషాధ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని నొరిల్స్క్‌ ప్రాంతంలో జరిగిన విపత్తు ప్రతిస్పందన నిర్వహణ బృందాల శిక్షణా కార్యక్రమంలో ఈ ఘటన జరిగినట్లు రష్యా ప్రభుత్వం పేర్కొంది. 
 
రష్యన్‌ ఎమర్జెన్సీస్‌ మినిస్టర్‌గా ఉన్న జినిచెవ్‌ (55), నొరిల్స్క్‌ ప్రాంతంలో నిర్మిస్తోన్న ఓ అగ్నిమాపక కేంద్రం సందర్శనకు వెళ్లారు. అక్కడ భారీ ఎత్తున ఏర్పాటు చేసిన రిస్క్యూ టీం మాక్‌ డ్రిల్‌ను పర్యవేక్షించారు. 
 
అదే సమయంలో ఆ కార్యక్రమాన్ని చిత్రీకరిస్తోన్న ఓ కెమెరామెన్‌ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అతన్ని రక్షించేందుకు మంత్రి జినిచెవ్‌ నీటిలోని దూకారు. అతను నేరుగా నీటిలో ఉన్న బండరాతికి తగలడంతో జినిచెవ్‌ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా మీడియా వెల్లడించింది.
 
ఫెడెరల్‌ సెక్యూరిటీ సర్వీసస్‌లో సేవలందించిన జినిచెవ్‌.. 2018 నుంచి రష్యా అత్యవసర పరిస్థితులశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ రక్షణ వ్యవహారాల్లోనూ జినిచెవ్‌ కొంతకాలం పాటు కొనసాగారు. జినిచెవ్‌ మృతిపట్ల అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments