Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణ టిక్కెట్ - పాస్ పోర్టు - వీసా లేకుండా దేశాలు దాటేశాడు.. ఎలా?

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (09:33 IST)
రష్యా పౌరుడు ఒకడు ఎలాంటి ప్రయాణ టిక్కెట్, వీసా, పాస్‌పోర్టు, బోర్డింగ్ ఇలాంటివి ఏవీ లేకుండా ఏకంగా దేశాల సరిహద్దులను దాటేశాడు. చివరకు విమానాశ్రయ భద్రతా సిబ్బంది చిక్కాడు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా ఎలా వచ్చావని అడిగితే తనకు ఏమీ గుర్తు లేదని చెప్పి షాకిచ్చాడు. అయితే, ఈ ఘటన గత నెలలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రష్యాకు చెందిన సెర్గెయ్ వ్లాదిమిరోవిచ్ ఒచిగవా అనే వ్యక్తి ఇజ్రాయెల్ దేశంలో స్థిరపడ్డారు. నవంబర్ నాలుగో తేదీన ఆయన డెన్మార్క్‌లోని కోపెన్ హాగెన్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికాలోని లాస్ఏంజిలిస్‌కు ప్రయాణించారు. అయితే, ఈ ప్రయాణానికి సంబంధించి ఆయన ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకోలేదు. పాస్‌పోర్ట్ వెంట తీసుకెళ్లలేదు, టికెట్ కొనలేదు, వీసా కూడా లేదు.. అంతెందుకు విమానంలోకి ఎంటర్ కావడానికి తప్పనిసరి అయిన బోర్డింగ్ పాస్ కూడా ఒచిగవా దగ్గర లేదు. అయినా విమానం ఎక్కి దేశాలు దాటి ప్రయాణించాడు.
 
ఎలాంటి పత్రాలు లేకుండా విమానం దిగిన ఒచిగవాను చూసి లాస్ఏంజిలిస్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఇతర విమానాలలో వచ్చాడేమోనని మిగతా ప్రయాణికుల వివరాలను పరిశీలించారు. ఆ రోజు వచ్చిన విమానాలే కాదు అంతకుముందు రెండు మూడు రోజుల ప్రయాణికుల జాబితాలోనూ ఒచిగవా పేరులేదు. దీంతో ఇదెలా సాధ్యమైందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 
 
ఒచిగవాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. మూడు రోజులుగా తనకు నిద్రలేదని, అసలు విమానం ఎలా ఎక్కానో కూడా తనకు గుర్తులేదని చెప్పాడు. ప్రయాణం మధ్యలో ఒచిగవా పలుమార్లు సీట్లు మారాడని, భోజనం కోసం ఒకటికి రెండుసార్లు రిక్వెస్ట్ చేశాడని ఫ్లైట్ అటెండెంట్స్ చెప్పారు. ఒచిగవా కాస్త అశాంతిగా కనిపించాడని విచారణలో వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై అమెరికా నేర పరిశోధనా సంస్థ ఎఫ్‌బీఐ ప్రస్తుతం విచారణ జరుపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవీశ్రీ ప్రసాద్ లేనిదే నా జర్నీ శూన్యం - నా లైఫ్ మార్చింది ఆ దర్శకుడే : తేల్చిచెప్పిన అల్లు అర్జున్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments