Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కర్ట్ ధరించి వస్తేనే బోనస్ : మహిళలకు రష్యా కంపెనీ ఆఫర్

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (15:41 IST)
రష్యాకు చెందిన ఓ కంపెనీ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. అదీకూడా కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగులకు మాత్రమే. మేకప్ చేసుకుని స్కర్టులు ధరించి వచ్చిన వారికి మాత్రమే బోనస్ ఇస్తామని సెలవిచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రష్యాకు చెందిన టాటా ప్రూఫ్ అనే అల్యూమినియం తయారీ కంపెనీ 2014లో రష్యాలో నిర్వహించిన వింటర్ ఒలింపిక్స్ పోటీల్లో వివిధ రకాల అల్యూమినియం ఉపకరణాలను తయారుచేసి సరఫరా చేసింది. 
 
అయితే, ఈ కంపెనీ తాజాగా మహిళా ఉద్యోగుల కోసం ఫెమినిటీ మారథాన్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ ఈవెంట్ నెల రోజుల పాటు జరుగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలు మోకాళ్ళపైకి స్కర్టులు ధరించి, ఫుల్‌మేకప్‌తో వస్తే రోజుకు 100 రుబుళ్లు (భారత కరెన్సీలో రూ.107) బోనస్ ఇస్తామంటూ ప్రకటన చేసింది. 
 
అయితే, ఈ ఆఫర్‌ను అంగీకరించేందుకు మహిళా ఉద్యోగులు తమ ఫోటోలను ఓ ప్రత్యేక ఫోన్ నంబరుకు పంపాల్సి ఉంటుంది. ఈ విషయం సోషల్ మీడియాలో లీకై వైరల్ అయింది. దీంతో  రష్యాలోని మహిళా సంఘాలతో పాటు నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ కంపెనీ చర్యలను ఖండిస్తున్నారు. స్కర్టులు, మేకప్‌లు వేసుకోవాల్సింది మహిళలు కాదనీ కంపెనీ యాజమాన్యమే వేసుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments