Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డీజీపీగా గౌతం సవాంగ్... కాల్‌మనీ నేతల గుండెల్లో రైళ్లు

డీజీపీగా గౌతం సవాంగ్... కాల్‌మనీ నేతల గుండెల్లో రైళ్లు
, శనివారం, 1 జూన్ 2019 (15:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీ (పోలీస్ బాస్)గా గౌతం సవాంగ్ నియమితులయ్యారు. ఈయన విజయవాడ నగర మాజీ పోలీస్ కమిషనర్. దీంతో విజయవాడతో పాటు దానిపరిసర ప్రాంతాల్లో జరిగిన కాల్‌మనీ దందా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని రాజకీయ పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 
 
ఈ కాల్‌మనీ కేసులో గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అనేక మంది టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, పై స్థాయిలో నుంచి వచ్చిన ఆదేశాల మేరకు విజయవాడ నగర పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరం గురంచి క్షుణ్ణంగా తెలిసిన గౌతం సవాంగ్ ఇపుడు ఏకంగా డీజీపీగా నియమితులు కావడంతో కాల్‌మనీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల భయంతో వణికిపోతున్నారు. 
 
దీనికితోడు డీజీపీకి ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీనిపై గౌతం సవాంగ్ స్పందిస్తూ, తనన నమ్మి డీజీపీగా బాధ్యతలు అప్పగించిన సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. పైగా, తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. అయితే సైబర్ నేరాల అడ్డుకట్టకు పోలీసులు మరింతగా కష్టపడాల్సి వస్తుందన్నారు. 
 
అలాగే, కాల్‌మనీ కేసులపై ఆయన స్పందిస్తూ, విజయవాడలో రెండువేల కాల్‌మనీ కేసులు సెల్‌కు వచ్చాయి. ప్రతి కేసు డిఫరెంట్‌గా ఉంది. కాల్‌మనీలో చాలా కేసులు ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. కాల్‌మనీ కేసుల పరిష్కారంలో బెజవాడ బార్ అసోసియేషన్ సహాకారం మరువలేనిది. ఏకపక్షంగా కొన్ని వర్గాల కోసమే నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉండదన్నారు. 
 
అందరూ సమానమేనని సీఎం జగన్ చెప్పిన మాట అదే. అంతేకాకుండా పోలీసుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాం. హెల్త్ స్కీమ్‌ను ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ఎలక్షన్స్, క్రికెట్ బెట్టింగ్స్ చేసే బుకీలపై దృష్టి పెడతాం. సోషల్ మీడియా అనేది విస్తృతమైన నెట్‌వర్క్.. వాటిలో వాస్తవాలు తెలుసుకొనేందుకు ప్రత్యేక దృష్టిపెడతామని గౌతం సవాంగ్ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

9న తిరుమలకు ప్రధాని మోడీ : నవ్యాంధ్రలో సీబీఐ ఎంట్రీ