Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా నుంచి భారత్‌కు వైద్య సామాగ్రి.. 150 బెడ్‌సైడ్ మానిటర్లు..

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (11:27 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి అంతకంతకూ పెరిగిపోతున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలోని ఆస్పత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. 
 
రోగుల తాకిడి పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌తోపాటు, ఇతర వైద్య సామాగ్రి కూడా నిండుకుంటుంది. ఈ నేపథ్యంలో పొరుగుదేశాలన్నీ భారత్‌కు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకొస్తున్నాయి.
 
తాజాగా రష్యా కూడా భారత్‌కు భారీగా వైద్యసామాగ్రిని పంపింది. రష్యా నుంచి 20 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 75 వెంటిలేటర్లు, 150 బెడ్‌సైడ్ మానిటర్లు, 22 మెట్రిక్ టన్నుల ఔషధాలతో బుధవారం బయలుదేరిన రెండు విమానాలు ఈ తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాయి.
 
విమానాల నుంచి వైద్య సామాగ్రిని అన్‌లోడ్ చేయించిన అధికారులు అవసరమున్న వివిధ ఆస్పత్రులకు దాన్ని చేరేవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments