Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాకు యుద్ధం సెగ - నిత్యావసరాల విక్రయాలపై పరిమితి

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (10:42 IST)
ఉక్రెయిన్‌ దేశంపై ఏకపక్షంగా దండయాత్ర చేస్తున్న రష్యాకు యుద్ధం సెగ తగిలింది. ప్రపంచ దేశాల విజ్ఞప్తులను తోసిరాజని ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యాపై అనేక ప్రపంచ దేశాలు వివిధ రకాలైన ఆంక్షలను విధిస్తున్నాయి. 
 
వీటిలో ఆర్థిక ఆంక్షలు, ఎగుమతుల ఆంక్షలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రష్యా ఆర్థిక ఆంక్షల చక్రబంధంలో కొట్టుమిట్టాడుతుంది. దీంతో రష్యా అప్రమత్తపై ముందు జాగ్రత్తగా నిత్యావసరాల విక్రయాలపై పరిమితి విధించింది. 
 
రిటైల్ ఔట్‌లెట్లలో నిత్యావసరాల విక్రయాలపై పరిమితి విధించింది. నిత్యావసర వస్తువులను ప్రజలందరికీ అందుబాటులో ఉంచే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. నిత్యావసర వస్తువులు నల్లబజారుకు తరలిపోకుండా ఈ ఆంక్షలు అడ్డుకుంటాయన ప్రభుత్వం భావిస్తుంది. 
 
మరోవైపు యుద్ధం కారణంగా ఎదురుకాబోయే పరిస్థితులను ముందుగానే ఊహించిన దుకాణదారులు పెద్ద ఎత్తు సరకులు కొనుగోలు చేసి నిల్వచేసుకున్నారు. దీంతో నిత్యావసర వస్తు ధరలు పెరిగిపోవడంతో దేశ వ్యాప్తంగా కొరత కూడా ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఈ తరహా కఠిన నిర్ణయం తీసుకుంది. 
 
మరో రష్యా యుద్ధ విమానం కూల్చివేత 
 
రష్యాకు చెందిన మరో యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ సేనలు కూల్చివేశాయి. గత 11 రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సాగిస్తున్న విషయం తెల్సిందే. ఈ యుద్ధాన్ని తక్షణం ఆపాలంటూ ప్రపంచ దేశాలు చేస్తున్న విజ్ఞప్తులను రష్యా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సైతం పట్టుకుని ఈడ్చుకొచ్చి కాల్చిపారేస్తుంది.
 
మరోవైపు, రష్యా దురాక్రమణతో ఉక్రెయిన్ నుంచి 1.5 మిలియన్ల మంద ఇతర దేశాలకు తరలిపోయారు. మరోవైరు, ఉక్రెయిన్‌ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ చేస్తున్న విజ్ఞప్తులను నాటో దేశాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధంతో ఇరు వైపులా భారీ నష్టం వాటిల్లుతుంది. 
 
ఇదిలావుంటే, తమ దేశంపై బాంబులు కురిపించందుకు వచ్చిన రష్యా యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ సేనలు కూల్చివేశాయి. ఖార్కివ్ మీదుగు ఎగురుతున్న రష్యన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు ప్రకటించింది. పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయాడని తెలిపింది. కులినిచిన్ ప్రాంతంలో విమానం కూలిపోయినట్టు వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments