Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్ దూకుడు

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (11:46 IST)
బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో రిషి సునాక్ దూసుకెళుతున్నారు. భారత సంతతికి చెందిన ఈయన మరింత ఆధిక్యం దిశగా ముందుకుసాగుతున్నారు. తాజాగా కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలతో జరిగిన మూడో రౌండ్​ ఓటింగ్​లో 115 ఓట్లతో నలుగురు అభ్యర్థుల్లో అగ్రస్థానంలో నిలిచారు. 
 
వీరిలో వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్‌ 82 ఓట్లతో రెండో స్థానంలో, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రుస్‌ 71 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. కెమి బడెనోచ్‌కు 58 ఓట్లు వచ్చాయి. తదుపరి విడత ఓటింగ్‌ మంగళవారం జరగనుంది. ఇందులో మరింత వడపోత జరుగుతుంది. 
 
గురువారం నాటికి బరిలో ఇద్దరే మిగులుతారు. ఆ తర్వాత 1,60,000 మంది అర్హులైన కన్జర్వేటివ్‌ పార్టీ ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ప్రధానిని ఎన్నుకుంటారు. విదేశాంగ శాఖ కమిటీ ఛైర్మన్​ టామ్​ తుగెన్‌ధాట్ 31 ఓట్లు సాధించి పోటీ నుంచి నిష్క్రమించారు.
 
అంతకుముందు గురువారం నిర్వహించిన రెండో దశ ఎన్నికలో అత్యధికంగా 101 మంది ఎంపీలు సునాక్‌కు మద్దతు తెలిపారు. రెండో రౌండ్​లో సునాక్​ తర్వాత.. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్ (83 ఓట్లు), విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ (64 ఓట్లు), మాజీ మంత్రి కెమీ బదెనోచ్ (49 ఓట్లు), టోరీ బ్యాక్‌బెంచర్ టామ్ తుగెన్‌ధాట్ (32 ఓట్లు) వరుసగా నిలిచారు. 
 
బ్రిటన్‌ నూతన ప్రధానిని కన్జర్వేటివ్‌ పార్టీ ఈ ఏడాది సెప్టెంబరు 5న ఎన్నుకోనుంది. కన్జర్వేటివ్‌ పార్టీ అధినేతగా ఎన్నికైనవారే బ్రిటన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతారు. కన్జర్వేటివ్‌ హోం వెబ్‌సైట్‌ తమ పార్టీలో నిర్వహించిన ఓ సర్వేలో సునాక్‌ మూడో స్థానానికి పరిమితమవుతారని అంచనా వేసింది. పెన్నీ మోర్డాంట్‌ ప్రధాని పీఠం దక్కించుకుంటారని జోస్యం చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments