Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌ రాణి మరణానంతరం ఇంద్రధనస్సులు.. బంగారు వర్ణంలో మేఘం

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2022 (18:37 IST)
Rainbow
బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 మరణానంతరం ఆమె నివసించిన బకింగ్‌హామ్ ప్యాలెస్ మీదుగా రెండు ఇంద్రధనస్సులు కనిపించాయి. అలాగే ఒక నగరంపై ఆకాశంలో ఎలిజబెత్‌ రూపంలో, బంగారు వర్ణంలో ఉన్న మేఘం ఆకట్టుకుంది. 96 ఏళ్ల క్వీన్‌ ఎలిజబెత్‌, స్కాట్లాండ్‌లోని వేసవి విడిది నివాసంలో వుండగా గురువారం కన్నుమూశారు. 
 
ఈ ప్రకటన చేసిన కొన్ని నిమిషాల తర్వాత ష్రాప్‌షైర్‌లోని టెల్ఫోర్డ్ ప్రాంతంపై ఆకాశంలో బంగారు వర్ణంలో ఎలిజబెత్‌ను పోలిన మేఘం కనిపించింది. 
 
లిన్నేఅనే మహిళ కారులో వెళ్తుండగా ఆమె 11 ఏళ్ల కుమార్తె దీనిని గుర్తించింది. అమ్మా.. 'క్వీన్‌' అని అరిచిన ఆ బాలిక ఎలిజబెత్‌ రూపంలో ఉన్న ఆ మేఘాన్ని తల్లికి చూపించింది. 'ఓ మై గాడ్‌' అంటూ ఆమె షాక్ అయ్యింది. 
 
దీంతో కారును నిలిపిన ఆ మహిళ తన మొబైల్‌ ఫోన్‌లో ఫొటోలు తీసింది. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, క్వీన్‌ ఎలిజబెత్‌ను పోలిన బంగారు వర్ణంలో ఉన్న మేఘం ఫొటో వైరల్‌ అయ్యింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments