Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 ఎలా చనిపోయారు?

queen elizabeth
, శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (08:13 IST)
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 ఇకలేరు. ఆమె గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బ్రిటన్ దేశాన్ని ఏడు దశాబ్దాలపాటు పాలించిన ఆమె అనారోగ్యంతో పాటు వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఆమె మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
 
96 యేళ్ళ క్వీన్... గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చింది. ఈమె గురువారం రాత్రి భారత కాలమానం ప్రకారం స్కాంట్లాండ‌లోని బాల్‌మోరల్ ప్యాలెస్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మరణవార్తలను ప్యాలెస్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. రాణి ఆరోగ్యం విషమంగా ఉందన్న సమాచారంతో ఆమె కుటుంబ సభ్యులంతా ముందుగానే స్కాట్లాండ్‌లోని రాణి నివాసానికి చేరుకున్నారు. ఆమె భౌతికకాయాన్ని బ్రిటన్‌లోని ప్యాలెస్‌కు తీసుకునిరానున్నారు. మరోవైపు, రాణి మరణంతో బ్రిటన్ ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు. 
 
బ్రిటన్ దేశాన్ని 70 యేళ్ల పాటు పాలించిన రాణి ఎలిజబెత్-2గా గుర్తింపు పొందారు. గత 1922లో జన్మించిన ఆమె ప్రిన్స్ ఫిలిప్ మౌట్ బాటెన్‌ను 1947లో వివాహం చేసుకున్నారు. 22 యేళ్ల వయస్సులోనే బ్రిటన్ రాణి కిరీటాన్ని ధరించారు. అప్పటి నుంచి ఆమె బ్రిటన్ రాణిగా కొనసాగారు. బ్రిటన్ రాజకుటుంబం చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగారు. రాణి 70 యేళ్ల సేవలకు గుర్తుగా గత జూన్ నెలలో కూడా దేశ వ్యాప్తంగా ప్లాటినం జూబ్లీ వేడుకలను కూడా నిర్వహించారు.
 
కాగా, బ్రిటన్ రాణి ఎలిజబెత్2 మృతిపట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వెల్లడించారు. ఈ కాలపు గొప్ప నాయకురాలిగా రాణి ఎలిజబెత్ నిలిచిపోతారని మోడీ అన్నారు. బ్రిటన్‌కు సమర్థమైన, స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని రాణి ఎలిజబెత్ అందించారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమ ఐపీఓ కోసం దరఖాస్తు చేసిన హైపర్‌ లోకల్‌ జ్యువెలరీ రిటైల్‌ చైన్‌ వైభవ్‌ జ్యువెలరీ