Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రిటన్‌ రాణి క్వీన్ ఎలిజబెత్ II ఇకలేరు

Queen Elizabeth
, గురువారం, 8 సెప్టెంబరు 2022 (23:34 IST)
బ్రిటన్‌ను సుదీర్ఘకాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్ II గురువారం రాత్రి కన్నుమూసారు. ఆమె వయస్సు 96 ఏళ్లు. ఎలిజబెత్ రాణి గత సంవత్సరం చివరి నుండి బకింగ్‌హామ్ ప్యాలెస్ "ఎపిసోడిక్ మొబిలిటీ సమస్యలు" అని పిలిచే వ్యాధితో బాధపడుతున్నారు.

 
గత అక్టోబర్‌ నెలలో ఎలిజబెత్ రాణి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఒకరోజు రాత్రి అంతా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ గడిపింది. అప్పటి నుండి అనారోగ్య సమస్య రీత్యా ఆమె బహిరంగ కార్యక్రమాలను తగ్గించుకోవలసి వచ్చింది. బుధవారం ఆమె వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో సీనియర్ మంత్రులతో వర్చువల్ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు.

 
అంతకుముందు రోజు ఆమె బాల్మోరల్‌లో దేశం యొక్క కొత్త ప్రధాన మంత్రిగా లిజ్ ట్రస్‌ను నియమిస్తున్నట్లు చెప్పబడింది. ఎలిజబెత్ 1952 నుండి కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సహా బ్రిటన్ దేశంతో పాటు డజనుకు పైగా ఇతర దేశాలకు రాణిగా ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జూన్‌ నెలలో నాలుగు రోజుల జాతీయ వేడుకలతో సింహాసనంపై ఆశీనురాలైన ఆమె తన పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. ఆ ఆరు జిల్లాలకు అలెర్ట్