Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమ ఐపీఓ కోసం దరఖాస్తు చేసిన హైపర్‌ లోకల్‌ జ్యువెలరీ రిటైల్‌ చైన్‌ వైభవ్‌ జ్యువెలరీ

Harm
, శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (00:13 IST)
విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న సంస్ధ మనోజ్‌ వైభవ్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ లిమిటెడ్‌. దక్షిణ భారతదేశంలో  సుప్రసిద్ధ ప్రాంతీయ ఆభరణాల బ్రాండ్‌గా ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణా రాష్ట్రాలలో 8 పట్టణాలు, 2 నగరాలలో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ తమ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ద్వారా నిధులను సేకరించేందుకు తమ డ్రాఫ్ట్‌రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ)ని మార్కెట్స్‌ రెగ్యులేటర్‌, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) వద్ద సమర్పించింది.
 
ఈ పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా 10 రూపాయలు ముఖ విలువ కలిగిన షేర్లను 210 కోట్ల రూపాయల వరకూ జారీ చేయనున్నారు. ప్రమోటర్‌ సెల్లింగ్‌ షేర్‌హోల్డర్‌  గ్రంధి భారత మల్లికా రత్నకుమారి (హెచ్‌యుఎఫ్‌)కు చెందిన 43,00,000 ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఈ కంపెనీ, సుప్రసిద్ధ బ్యాంకర్లను ఈ ఇష్యూ కోసం  సంప్రదించించడంతో పాటుగా మరోమారు 40 కోట్ల  రూపాయల నగదు కోసం ఈక్విటీ షేర్లను జారీ చేయవచ్చు. ఒకవేళ ఆ తరహా ప్లేస్‌మెంట్స్‌ పూర్తయితే తాజా ఇష్యూ సైజ్‌ తగ్గుతుంది.
 
ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తాలను 8 నూతన షోరూమ్‌ల ఏర్పాటుకు అవసరమైన నిధులను సమకూర్చడం కోసం వినియోగిస్తారు. ఈ షోరూమ్‌లకు 12 కోట్ల రూపాయలు ఖర్చయితే, వాటి ఇన్వెంటరీకి 160 కోట్ల రూపాయలు కానుందని అంచనా. 2023- 2024 ఆర్ధిక సంవత్సరాలలో ఈ మొత్తాలను వినియోగించనున్నారు.  మిగిలిన మొత్తాలను సాధారణ కార్పోరేట్‌ కార్యకలాపాల కోసం వినియోగిస్తారు. వైభవ్‌ జ్యువెలర్స్‌ను దివంగత శ్రీ మనోజ్‌కుమార్‌ గ్రంధి 1994లో ప్రారంభించారు. ప్రస్తుతం మొదటి తరపు మహిళా వ్యాపారవేత్త శ్రీమతి భారత మల్లికా రత్న కుమారి గ్రంధి తన కుమార్తె గ్రంధి సాయి కీర్తనతో కలిసి నిర్వహిస్తున్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలో ఆర్గనైజ్డ్‌ జ్యువెలరీ మార్కెట్‌లో ప్రవేశించిన తొలి తరం బ్రాండ్‌లలో ఈ జ్యువెలరీ బ్రాండ్‌ ఒకటి. ఇది హబ్‌ అండ్‌ స్పోక్‌ నమూనాలో చిన్న పరిమాణపు షోరూమ్‌లను భారీ షోరూమ్స్‌ చుట్టూ నిర్వహిస్తూ అన్ని విభాగాల అవసరాలనూ తీరుస్తుంది. దీని ఫ్లాగ్‌షిప్‌ స్టోర్లు విశాఖపట్నంలో 29,946 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండటంతో పాటుగా నాలుగు విభిన్నమైన ఫ్లోర్లతో వినూత్నమైన షాపింగ్‌ అనుభవాలను అందిస్తుంది.
 
77% రిటైల్‌ షోరూమ్‌లు టియర్‌ 2, టియర్‌ 3 పట్టణాలలో ఉంటే, మిగిలినవి హైదరాబాద్‌, విశాఖపట్నంలలో ఉండి నగర వినియోగదారుల అవసరాలను తీరుస్తున్నాయి. దీని షోరూమ్‌లన్నీ కూడా వైవిధ్యమైన, భారీ ఇన్వెంటరీ డిజైన్‌లను విస్తృతశ్రేణి ఉత్పత్తులను బంగారం, వజ్రాలు, జెమ్స్‌, ప్లాటినమ్‌, వెండి ఆభరణాలలో అందిస్తుంది. దీని ఉప బ్రాండ్‌ విశేష , ప్రీమియం బంగారం, వజ్రాభరణాలను అందిస్తుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రిటన్‌ రాణి క్వీన్ ఎలిజబెత్ II ఇకలేరు