Webdunia - Bharat's app for daily news and videos

Install App

సద్దాం హుస్సేన్‌కు పట్టిన గతే కింగ్ జాంగ్‌ ఉన్‌కు పడుతుందట...

ప్రపంచ దేశాల విజ్ఞప్తులను ధిక్కరించి యధేచ్చగా క్షిపణి, అణు పరీక్షలను నిర్వహిస్తున్న ఉత్తర కొరియాకు రష్యా గతంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర హెచ్చరిక చేసింది. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగిన పక్షంలో ఇరాక్ అధ్య

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (09:13 IST)
ప్రపంచ దేశాల విజ్ఞప్తులను ధిక్కరించి యధేచ్చగా క్షిపణి, అణు పరీక్షలను నిర్వహిస్తున్న ఉత్తర కొరియాకు రష్యా గతంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర హెచ్చరిక చేసింది. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగిన పక్షంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌కు పట్టిన గతే ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు కూడా పడుతుందని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. 
 
గత కొన్ని రోజులుగా అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనివుంది. దీనిపై పుతిన్ స్పందిస్తూ, అమెరికాతో కయ్యానికి కాలు దువ్వడం ఉత్తర కొరియాకు ఏమాత్రం మంచిది కాదన్నారు. ప్రపంచంలో ఏ దేశమైనా అణ్వాయుధాలు కలిగి ఉండవచ్చని అన్నారు. అయితే వాటిని రెచ్చగొట్టేందుకు వాడకూడదని ఆయన హితవు పలికారు. 
 
అమెరికా ప్రధాన భూభాగాలను లక్ష్యం చేసుకుని ఉత్తర కొరియా అణుదాడులు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ... ఆ క్షిపణులు ప్రయోగించిన తర్వాత అవి నిర్దేశిత లక్ష్యంపై పడతాయన్న నమ్మకం లేదని అన్నారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులే తనకు చెప్పారని ఆయన అన్నారు.
 
అదేసమయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ హిస్టీరియా వ్యాధితో బాధపడుతున్నారని పుతిన్ వెల్లడించారు. అమెరికాపై అణుదాడి చేస్తే అది తగ్గుతుందని కిమ్ అనుకుంటున్నారని, అది ఈ జన్మలో జరిగే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. 
 
అంతేకాకుండా అమెరికాతో యుద్ధానికి దిగితే ఉత్తరకొరియా మరొక ఇరాక్ అవుతుందని, సద్దాం హుస్సేన్‌‌కు పట్టిన గతే కిమ్ జాంగ్ ఉన్‌‌కు కూడా పడుతుందని పుతిన్ హెచ్చరించడం గమనార్హం. కాగా, ఉత్తర కొరియాకు అండగా ఉన్న దేశాల్లో రష్యా కూడా ఒకటి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments