Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సంతానం రాచబిడ్డల్లా పెరగకూడదు.. అందుకే ఈ నిర్ణయం : ప్రిన్స్ హ్యారీ

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (12:43 IST)
బ్రిటన్ యువరాజు హ్యారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సంతానం రాచబిడ్డలా పెరగకూడదన్నారు. అందుకే, కుటుంబానికి దూరంగా వచ్చేసినట్టు చెప్పారు. ముఖ్యంగా, తనను పెంచేందుకు తన తండ్రి ఎన్నో కష్టాలు పడ్డారన్నారు. ఆ కష్టాలు తనతో పాటు.. తన బిడ్డలు పడకూడదనే బాధలు, బంధనాల నుంచి విముక్తి పొందేందుకే కుటుంబం అనే సంకెళ్లు తెంచుకుని అమెరికాకు వెళ్లామన్నారు. తన తండ్రి ప్రిన్స్ చార్లెస్ పడిన బాధలే తానూ పడ్డానని చెప్పుకొచ్చారు. 
 
గురువారం ‘ఆర్మ్ చెయిర్ ఎక్స్‌పర్ట్’ పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితంలోని పలు విషయాలను పంచుకున్నారు. తాను తీసుకున్న నిర్ణయం విషయంలో తన తండ్రిని నిందించదలచుకోలేదని హ్యారీ చెప్పారు. అయితే, తన పిల్లల విషయంలో మాత్రం తన తండ్రి చేసిన తప్పే చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. 
 
తన పిల్లల పెంపకం విషయంలో తాను చాలా ఆవేదనకు గురయ్యానన్నారు. రాజకుటుంబంలో ఇలాంటి బాధలే తన తల్లిదండ్రులూ పడి ఉండొచ్చన్నారు. కాబట్టి ఆ బాధల బంధనాలను తెంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చానని తెలిపారు.
 
తమ పెంపకం విషయంలో తన తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో, రాచబిడ్డల్లా తమను పెంచేందుకు ఎంత ఆవేదన అనుభవించారో ఇప్పుడు అర్థమవుతోందని చెప్పారు. ఇలాంటి పెంపకాన్ని తన పిల్లలకు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే భార్యాపిల్లలతో అమెరికాకు వచ్చేశానని ఆయన వివరించారు. ప్రస్తుతం మేఘన్‌తో కలిసి ఆయన లాస్ఏంజిలిస్‌కు సమీపంలోని మోంటేసిటోలో ప్రిన్స్ హ్యారీ దంపతులు నివసిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments