Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిపబ్లిక్‌డే వేడుకలకు బ్రిటన్‌ ప్రధాని

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (06:06 IST)
జనవరి 26న దేశరాజధాని ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హాజరు కానున్నారు. భారతదేశం నుండి వచ్చిన ఈ ఆహ్వానాన్ని జాన్సన్‌ గొప్ప గౌరవంగా భావించారని యుకె విదేశాంగశాఖ కార్యదర్శి డోమినిక్‌రాబ్‌ తెలిపారు.

భారత్‌ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న రాబ్‌ను భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్వాగతం పలికారు. అనంతరం రాబ్‌ మాట్లాడుతూ.. గతేడాది బోరిస్‌ జాన్సన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది ఆయన మొదటి దైపాక్షిక సందర్శనగా పేర్కొన్నారు.

కొత్త సంవత్సరంలో భారతదేశాన్ని సందర్శించడం పట్ల బోరిస్‌ జాన్సన్‌కు ఆనందంగా ఉందన్నారు. భారత ప్రధాని, తామూ కలిసి చేసిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా క్వాంటమ్‌ లీప్‌ను ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నారని తెలిపారు.

అలాగే వచ్చే ఏడాది బ్రిటన్‌లో జరగనున్న జి7 సమ్మిట్‌కు మోడీని బోరిస్‌ ఆహ్వానించినట్లు రాబ్‌ తెలిపారు. దీనిపట్ల భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ సంతోషం వ్యక్తం చేశారు. రిపబ్లిక్‌డే దినోత్సవ వేడుకలకు బోరిస్‌ రాకతో భారత్‌-యుకెల మధ్య సంబంధాలు కొత్త శకానికి నాంది పలికినట్లవుతుందని తెలిపారు.

కాగా.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి రిపబ్లిక్‌డే పరేడ్‌కు వచ్చిన బ్రిటీషర్లలో బోరిస్‌ రెండోవారు. 1993లో జాన్‌ మేజర్‌ హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments