Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకిల్ పైనే ప్రసవానికి వెళ్లిన న్యూజిలాండ్ మంత్రి..

మహిళలు ప్రసవానికి వెళ్తుతున్నారంటే.. కారు లేదా ఆటో, ఆంబులెన్స్ బుక్ చేస్తారు. మహిళకు ప్రసవం అనేది మరుజన్మలాంటిది. అందుకే వారిని సురక్షితమైన వాహనంలో ఆస్పత్రికి చేరుస్తారు. కానీ న్యూజిలాండ్ మహిళా మంత్రి

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (11:12 IST)
మహిళలు ప్రసవానికి వెళ్తుతున్నారంటే.. కారు లేదా ఆటో, ఆంబులెన్స్ బుక్ చేస్తారు. మహిళకు ప్రసవం అనేది మరుజన్మలాంటిది. అందుకే వారిని సురక్షితమైన వాహనంలో ఆస్పత్రికి చేరుస్తారు. కానీ న్యూజిలాండ్ మహిళా మంత్రి సైకిల్‌పై ప్రసవానికి వెళ్లారు. అవును నిజమే. ప్రసవ బాధలోనూ సైకిల్‌పై వెళ్తూ ఆస్పత్రిలో చేరారు. సాధారణ మహిళే ప్రసవానికి వెళ్తుందనగా.. ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేస్తారు. 
 
కానీ మంత్రి హోదాలో వున్న మహిళకు ఎలాంటి మర్యాద లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. కానీ నెలల నిండిన వేళ.. న్యూజిలాండ్‌కు చెందిన మహిళా మంత్రి, సైకిలుపై స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పతాక శీర్షికల్లో నిలిచారు. మహిళా, ఆరోగ్య, రవాణా శాఖల సహాయమంత్రిగా ఉన్న జూలీ ఎన్నే జెంటర్, సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి డెలివరీ నిమిత్తం వెళ్లగా, ఇప్పుడామె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 
 
ఇంకా జూలీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గర్భం ధరించిన 40 వారాల, నాలుగు రోజుల తరువాత సైకిలెక్కి ఆసుపత్రికి వెళ్లిన 38 ఏళ్ల జూలీ ఇప్పుడు డెలివరీ కోసం వేచి చూస్తోంది. ఆమె కనీసం మూడు వారాల మాతృత్వ సెలవు తీసుకోవాలని భావిస్తోందట. కాగా, ఈ సంవత్సరం న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెర్న్ ప్రసవించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యున్నత పదవిలో ఉండి ప్రసవించిన రెండో మహిళగా ఆమె రికార్డును సృష్టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments