అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

ఠాగూర్
గురువారం, 17 జులై 2025 (11:08 IST)
అమెరికాలోని అలాస్కా తీరంలో బుధవారం 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:37 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని కేంద్రం ద్వీప పట్టణం సాండ్ పాయింట్‌కు దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో ఉందని యూఎస్ఎస్ తెలిపింది. భూకంప కేంద్రం 20.1 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
 
భూకంపం తర్వాత దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పానికి అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ సంభవించే అవకాశం ఉందని అలాస్కాలోని పామర్ లోని జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. "దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పం, అలాస్కాలోని కెన్నెడీ ఎంట్రన్స్ (హోమర్కు 40 మైళ్లు దక్షిణాన) నుండి అలాస్కాలోని యూనిమాక్ పాస్ (ఉనలస్కాకు 80 మైళ్లు ఎన్ఈ) వరకు పసిఫిక్ తీరాలకు ఈ హెచ్చరిక జారీ చేయబడింది" అని కేంద్రం తెలిపింది.
 
కాగా, 1964 మార్చిలో ఈ మారుమూల రాష్ట్రం 9.2 తీవ్రతతో భూకంపం బారినపడింది. ఇది ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన భూకంపం. అలాగే అది ఆంకరేజ్ నగరాన్ని ధ్వంసం చేసింది. అలాస్కా గల్ఫ్, అమెరికా పశ్చిమ తీరం, హవాయిలను ముంచెత్తి సునామీని సృష్టించింది. భూకంపం, సునామీ ధాటికి 250 మందికి పైగా మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments