Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలికపై అత్యాచారం... దోషిగా తేలితే బహిరంగంగా ఉరితీశారు..

Advertiesment
hang

సెల్వి

, శనివారం, 12 జులై 2025 (14:48 IST)
ముస్లిం దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. శిక్షలను కూడా బహిరంగంగానే అమలు చేస్తుంటారు. తాజాగా ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముద్దాయిని బహిరంగంగా ఉరితీశారు. ఈ ఘటన ఇరాన్ దేశంలో జరిగింది. ఈ మేరకు ఆ దేశ మీడియా వెల్లడించింది. 
 
ఇరాన్ మీడియా కథనాల మేరకు బుకాన్‌కు చెందిన ఓ బాలికను అత్యాచారం, హత్య చేసిన కేసులో ఓ వ్యక్తి దోషిగా తేలాడు. అతడికి బహిరంగంగా మరణశిక్ష విధించాలని బాధిత కుటుంబసభ్యులు, ప్రజల నుంచి పెద్దఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. 
 
మార్చిలో అతడికి మరణశిక్ష ఖరారు కాగా.. సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది. భావోద్వేగాలతో ముడిపడిన కేసు కాబట్టి కఠినశిక్షపై నిర్ణయం తీసుకున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. బాధిత కుటుంబసభ్యుల కోరిక మేరకు శిక్షను విధిస్తున్నట్లు చెబుతూ తాజాగా దాన్ని అమలు చేశారు.
 
ఇరాన్‌లో బహిరంగంగా మరణశిక్షలు విధించడం సాధారణమే. హత్య, అత్యాచారం వంటి తీవ్రత ఎక్కువున్న కేసుల్లో ఇలాంటి కఠినమైన శిక్షలను అమలుచేస్తారు. మానవ హక్కుల సంఘాల ప్రకారం.. ప్రపంచంలో ఎక్కువ మరణశిక్షలు అమలుచేసే దేశాల్లో ఇరాన్‌ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమర్‌నాథ్ యాత్రలో శ్వాస అందక భక్తులు సతమతం: బిఎస్‌ఎఫ్ జవానుల సహాయం