Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెయిన్ డెడ్ అయిన మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 31 మార్చి 2019 (11:15 IST)
సాధారణంగా ఏదేని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఏమాత్రం స్పృహ లేకుండా, చికిత్సకు స్పందించకుండా ఉండే క్షతగాత్రులను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటిస్తుంటారు. ఇలాంటి వారి శరీరం నుంచి సేకరించే ఆర్గాన్స్‌ను ఇతరులకు అమర్చి ప్రాణదానం చేస్తుంటారు. అయితే, పోర్చుగల్ దేశంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ క్రీడాకారిణి రెండు నెలల తర్వాత పండండి బిడ్డకు జన్మనిచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ దేశానికి చెందిన కేథరీనా సెకీరా(26) అనే అంతర్జాతీయ క్రీడాకారిణి గతేడాది డిసెంబరులో ఆస్మా అటాక్ కారణంగా బ్రెయిన్ డెడ్ అయింది. అప్పటికే ఆమె 17వారాల గర్భవతి. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. అంటే బిడ్డకు జన్మనిచ్చే వరకు ఆమెకు చికిత్స అందించాలని కుటుంబసభ్యులు, డాక్టర్లు నిశ్చయించుకున్నారు. 
 
పోర్చుగల్ చట్టం ప్రకారం బిడ్డను అమానుషంగా చంపడం కూడా నేరం. దీంతో దాదాపు 32 వారాల పాటు ఆసుపత్రి మంచంపైనే వెంటిలేటర్‌తో కేథరీనాకు నియోనాటల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ వచ్చారు. గురువారం కేథరీనా మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉండటంతో కేథరీనా కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
అదేసమయంలో తమ కూతురు ఇక తమ కళ్ల ముందు కనపడదనే విషయాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కనీసం జన్మనిచ్చిన బిడ్డను కూడా చూసుకోలేని పరిస్థితి తమ కూతురికి వచ్చిందంటూ కుమిలిపోయారు. గత శుక్రవారం కేథరీనాకు వారు అంత్యక్రియలు నిర్వహించారు. పోర్చుగల్‌లో ఈ తరహా ప్రసవం జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం