Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్రెండ్స్ ముందు నగ్నంగా డ్యాన్స్ చేయలేదనీ కాళ్లు చేతులు కట్టేసి గుండు కొట్టిన భర్త

ఫ్రెండ్స్ ముందు నగ్నంగా డ్యాన్స్ చేయలేదనీ కాళ్లు చేతులు కట్టేసి గుండు కొట్టిన భర్త
, ఆదివారం, 31 మార్చి 2019 (10:32 IST)
పాకిస్థాన్‌కు చెందిన ఓ భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తన స్నేహితుల ముందు కట్టుకున్న భార్యను మద్యం సేవించి వివస్త్రగా మారి నృత్యం చేయాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆ వివాహిత అంగీకరించలేదు. దీంతో ఆమె కాళ్లూ చేతులు కట్టేసి బట్టలూడదీసి గుండుకొట్టాడు. ఈ దారుణం పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లాహోర్‌కు చెందిన ఫైజల్ అనే వ్యక్తికి అస్మా అనే మహిళతో కొన్ని నెలల క్రితం వివాహమైంది. ఫైజల్ ఓ పచ్చితాగుబోతు. వ్యసనపరుడు. ఈ క్రమంలో ఇటీవల తన స్నేహితులతో కలిసి పీకల వరకు మద్యం సేవించాడు. ఆ తర్వాత వారిని ఇంటికి తీసుకొచ్చి తన భార్యను పరిచయం చేశాడు. ఆ తర్వాత భార్యను కూడా మద్యం సేవించాలని ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె నిరాకరించింది. తనకు అలవాటు లేదని తెగేసి చెప్పింది. 
 
దీంతో బట్టలు విప్పి తన ముందు, స్నేహితుల ముందు డ్యాన్స్ చేయాలని గొడవ చేశాడు. తాగిన మత్తులో తన భర్త ఏం మాట్లాడుతున్నాడో కూడా తనకే అర్థం కావడంలేదని భార్య అస్మా కృంగిపోయింది. తాను అలాంటి పనులు చేయలేనని స్పష్టంగా చెప్పడంతో భర్త ఫైజల్‌కు కోపం వచ్చింది. తన స్నేహితుల ముందే భార్య కాళ్లను తాళ్లతో కట్టేసి ఆమె బట్టలన్నీ విప్పేశాడు. 
 
అంతేకాకుండా ట్రిమ్మర్ తీసుకుని ఆమెకు గుండు కొట్టేశాడు. నగ్నంగానే ఉరితీస్తానంటూ ఆమెను భయపెట్టాడు. ఐరన్ రాడ్ తీసుకుని ఆమెను విపరీతంగా కొట్టాడు. మరుసటి రోజు ఇంట్లో నుంచి పారిపోయిన అస్మా పోలీసులకు జరిగిన దారుణాన్ని వివరించింది. తనకు వైద్య పరీక్షలు చేయించమని వేడుకుంది. అయితే పోలీసులు మాత్రం ఆమె కేసును తీసుకోకపోగా.. ఆమెను డబ్బులివ్వమని బెదిరించారు. 
 
దీంతో ఏం చేయాలో తెలియని ఆస్మా సోషల్‌మీడియాలో తనకు జరిగిన విషయాన్ని వీడియో రూపంలో పెట్టి సాయం చేయాలని కోరింది. ఈ వీడియోను మానవహక్కుల మంత్రి షిరీన్ మజారీ చూడగా.. వెంటనే బాధితురాలికి సాయం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఆమెకు చికిత్స చేయించిన పోలీసులు.. ఆమె భర్త, అతని స్నేహితులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుక్క సంరక్షణకు మనుషులు లేరు... నీరవ్‌ మోడీకి బెయిలివ్వండి!