చర్చిల్లో సేవ చేస్తున్న అనేక మంది నన్స్‌లు సెక్స్ బానిసలుగా కొనసాగుతున్నారని క్రైస్తవ మతగురువు పోన్ ఫ్రాన్సిస్ వెల్లడించారు. ఈ నన్స్‌పై ఫాస్టర్లు, ప్రీస్టులు, బిషప్‌లు లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యల వల్ల అతి పవిత్రమైన ప్రార్థనా మందిరాలు అపఖ్యాతికి గురవుతున్నాయన్నారు.
మిడిల్ ఈస్ట్ దేశాల పర్యటనలో ఉన్న ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ, అనేక మంది బిషప్‌లు, ఫాస్టర్లు, ప్రీస్టులు దైవారాదన పేరుతో అత్యాచారాలు, అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. ఫలితంగా చర్చిల్లో ఉన్న నన్స్ (కన్యస్త్రీలు) సెక్స్ బానిసలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
పురాతన కాలం నుంచి ఈ తరహా దాడులు జరిగేవని, కానీ, క్రైస్తవ మంత సన్యాసినిలు మాత్రం బయటకు వచ్చి చెప్పడం తనకు తెలిసి ఇదే తొలిసారి అని చెప్పారు. పైగా, ఈ లైగింక దాడుల గురించి బయటకు చెప్పకుండా ఉండేందుకు కల్చర్ ఆఫ్ సైలెన్స్ అండ్ సీక్రెసీ పేరుతో వారి గొంతు నొక్కేస్తున్నారని అందుకే దాన్ని రద్దు చేసినట్టు తెలిపారు.