అమెరికా, ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఆకాశంలో ఎగురుతున్న సమయంలో ఇంధనం ఖాళీకావడంతో ఆ విమానం నడి రోడ్డుపై కుప్పకూలిపోయింది. దీంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో
అమెరికా, ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఆకాశంలో ఎగురుతున్న సమయంలో ఇంధనం ఖాళీకావడంతో ఆ విమానం నడి రోడ్డుపై కుప్పకూలిపోయింది. దీంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాజాగా చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే...
ఓ విమానం ఆకాశంలో ఎగురుతున్న సమయంలో ఇంధనం అయిపోయింది. దీన్ని గమనించిన పైలట్ ఏటీసీని సంప్రదించారు. అనంతరం అకస్మాత్తుగా విమానం కుప్పకూలింది. కుప్పకూలుతున్న విమానాన్ని అదుపు చేసేందుకు పైలట్ ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. దీంతో అది ఫ్లోరిడా సెంయిట్ పీట్ రోడ్డుపై కూలిపోయింది.
ఈ క్రమంలో విమానం వేగంగా కిందికి దిగడంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న కార్లను తోసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిని ఢీ కొట్టగానే విమానానికి మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానం నుంచి కిందికి దూకేశారు. ఈ ప్రమాదంలో రెండు ఎస్యూవీ వాహనాలు ధ్వంసం కాగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.