Webdunia - Bharat's app for daily news and videos

Install App

వోడాఫోన్ బంపర్ ఆఫర్... రూ.399 రీచార్జ్‌తో ఆర్నెల్లు ఉచితం

ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.399కే ఆరు నెలల పాటు వినియోగించుకునేలా 90 జీబీ 4జీ డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు అపరిమిత లోకల్/ఎస్టీడీ కాల్స్

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (07:29 IST)
ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.399కే ఆరు నెలల పాటు వినియోగించుకునేలా 90 జీబీ 4జీ డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు అపరిమిత లోకల్/ఎస్టీడీ కాల్స్ కూడా చేసుకోవచ్చని తెలిపింది.
 
ఇటీవల టెలికాం సంచలనం రిలయన్స్ జియో తన టారిఫ్ ఆఫర్లను సవరించిన విషయం తెల్సిందే. అయితే, వొడాఫోన్ మాత్రం ఏకంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 
 
రూ.399తో రీచార్జ్ చేసుకునే వినియోగదారులు తమ 90జీబీ 4జీ డేటాను అవసరమైతే ఒక్క రోజులోనే వినియోగించుకునే వెసులుబాటు కూడా ఉందని, లేదంటే ఆరు నెలలపాటు వినియోగించుకోవచ్చని వివరించింది. అంటే ఈ ఆఫర్‌లో ఒక జీబీ రూ.4.43కే వినియోగదారులకు లభిస్తుందని పేర్కొంది.
 
కాగా, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లు కూడా రూ.399 రీచార్జ్ ప్లాన్‌లు అందిస్తున్నా వాటి కాలపరిమితి, డేటా బాగా తక్కువగా ఉంది. జియో రోజుకు 1జీబీ చొప్పున 70 రోజుల కాలవ్యవధితో 84 జీబీ అందిస్తుండగా, ఎయిర్‌టెల్ రోజుకు ఒక జీబీ చొప్పున 70 రోజులపాటు 70జీబీ డేటాను అందిస్తోంది. వోడాఫోన్ మాత్రం వీటికి ధీటుగా 90జీబీతో పాటు.. 180 రోజులు ఇవ్వనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments