Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యూబాలో ఘోర విమానం ప్రమాదం.. 113 మంది మృతి

క్యూబాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 113 మంది మృత్యువాతపడ్డారు. హవానాలోని జోస్‌‌మార్టి ఎయిర్ పోర్ట్ నుంచి శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో టేకాఫ్‌ తీసుకున్న బోయింగ్‌ 737 ఫ్లైట్ కొద్దిస

Webdunia
శనివారం, 19 మే 2018 (08:41 IST)
క్యూబాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 113 మంది మృత్యువాతపడ్డారు. హవానాలోని జోస్‌‌మార్టి ఎయిర్ పోర్ట్ నుంచి శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో టేకాఫ్‌ తీసుకున్న బోయింగ్‌ 737 ఫ్లైట్ కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు 9 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 113 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు.
 
క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్‌ డియాజ్‌ కేనెల్‌ ప్రమాద స్థలాన్ని సందర్శించి.. సంతాపం తెలిపారు. చాలామందిని అంబులెన్సుల్లో తీసుకెళ్లడం చూశామని సంఘటన స్థలం వద్ద ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. గాయపడినవారిని హస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. 
 
కాగా, ప్రయాణికులు పూర్తిగా కాలిపోవడంతో మృతులను అధికారులు గుర్తించలేకపోతున్నారు. ప్రమాదానికి గురైన బోయింగ్‌ 737-201 విమానం 1979లో తయారైంది. దాన్ని క్యూబన్‌ ఎయిర్‌‌లైన్స్‌ అద్దెకు తీసుకుని నడుపుతుందని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments