Webdunia - Bharat's app for daily news and videos

Install App

పావురాళ్ళకు గర్భనిరోధక మాత్రలు.... గోల చేస్తున్న జంతు ప్రేమికులు

సాధారణంగా వీధి కుక్కల బెడద ఎక్కువైతే వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి.. కుక్కల ఉత్పత్తిని తగ్గిస్తారు. మరి పావురాళ్ళ బెడద ఎక్కువైతే ఏం చేయాలి? దీనిపై సుదీర్ఘంగా ఆలోచన చేసిన స్పెయిన్ వైద్యులకు ఓ విన

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (14:41 IST)
సాధారణంగా వీధి కుక్కల బెడద ఎక్కువైతే వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి.. కుక్కల ఉత్పత్తిని తగ్గిస్తారు. మరి పావురాళ్ళ బెడద ఎక్కువైతే ఏం చేయాలి? దీనిపై సుదీర్ఘంగా ఆలోచన చేసిన స్పెయిన్ వైద్యులకు ఓ వినూత్న ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా అమల్లో పెట్టేశారు. అదే.. పావురాళ్ళకు కూడా గర్భనిరోధక మాత్రలను ఇవ్వాలని నిర్ణయించారు. 
 
స్పెయిన్ దేశంలో పావురాళ్లు సంఖ్య అధికంగా ఉంది. ఇవి భవనాలపై చేరి.. రెట్టలు వేస్తుంటాయి. దీనివల్ల భవనం అందాలు దెబ్బతినిపోతున్నాయి. అలాగే, స్పెయిన్‌ దేశానికి వచ్చే పర్యాటకులకు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయట. దీంతో వీటిని నియంత్రించేందుకు గర్భనిరోధక మాత్రలు వాడాలని నిర్ణయించారు.
 
అయితే, స్పెయిన్ దేశంలోని జంతు ప్రేమికులు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పావురాలకు జులై నుంచి డిసెంబర్‌ మధ్య సంతానోత్పత్తి ఉంటుంది. దానికంటే ముందు గర్భనిరోధక మాత్రల్ని అవి తినే ఆహారంలో కలిపి పెడుతున్నారు. గతేడాది.. నగరంలో రెండు చోట్ల గర్భనిరోధక మాత్రలతో కూడిన ఆహారాన్ని వాటికి పెట్టారు. 
 
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 40 ప్రాంతాల్లో ఈ ఆహారం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ పద్ధతి సత్ఫలితాలిస్తే.. వచ్చే నాలుగైదు ఏళ్లల్లో 80 శాతం మేర పావురాల సంఖ్య తగ్గుతుందని.. పావురాలను చంపే పద్ధతిని పూర్తిగా నిషేధిస్తామని అధికారులు చెబుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments