Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దేవుడు శక్తినిస్తే అది చేసి చూపుతా : విశ్వసుందరి

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (11:29 IST)
2018 సంవత్సరానికిగాను విశ్వసుందరిగా ఫిలిప్పిన్స్‌కు చెందిన భామ ఎన్నికైంది. మొత్తం 94 మంది పోటీపడగా క్యాట్రియోనో ఎలైసా గ్రే ఫైనల్ పోటీల్లో నిలిచి విజేతగా ఎంపికైంది. ఫిలిప్పిన్స్ నుంచి విశ్వసుందరిగా ఎన్నికైన నాలుగో అమ్మాయి ఎలైసా కావడం గమనార్హం. 
 
ఈ పోటీల్లో ఎలైసాకు ఒక్క అందమే కాదు.. తెలివి తేటలు కూడా అలంకారప్రాయమయ్యాయి. ఫైనల్స్‌లో జడ్జీలు అడిగిన ప్రశ్న, చెప్పిన సమాధానం కూడా పస్ల్ అయ్యింది. "జీవితంలో నేర్చుకున్నగుణపాఠం ఏంటీ?, మిస్ యూనివర్స్‌గా ఆ సమస్యను ఎలా చూస్తారు? అనే ప్రశ్నను జడ్జిలు సంధించారు. దీనికి ఎలైసా గ్రే స్పష్టంగా సమాధానం చెప్పి జడ్జిల మనసులను గెలుచుకుంది.
 
"మనీలాలోని మురికివాడల్లోని చిన్నారులను చూసినప్పుడు ఎంతో బాధేసింది. వారి ముఖాల్లో చిరునవ్వును, అందాన్ని చూడాలని కోరుకుంటున్నాను. నాకు ఆ దేవుడు శక్తి ఇస్తే ఆ చిన్నారుల్లో మార్పు కోసం ప్రయత్నిస్తా. వారికి మంచి, చెడులు, విద్య అందిస్తా" అని చెప్పారు. ఈ సమాధానానికి ఫిదా అయిన జడ్జీలు ఆమెకు విజేతగా ప్రకటించారు.
 
కాగా, ఎలైసా గ్రే ఒక సాధారణమైన యువతి కాదు. మ్యూజిక్ థీయరీలో మాస్టర్ డిగ్రీ చేసింది. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ రన్నరప్‌గా సౌతాఫ్రికాకి చెందిన టామేరిన్ గ్రీన్ సెలక్ట్ అయ్యింది. సెకండ్ రన్నరప్‌గా వెనిజులా బ్యూటీ స్తేఫనీ నిలిచింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments