పిల్లలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌.. ఎఫ్‌డీఏకి దరఖాస్తు చేసుకున్న ఫైజర్‌

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (09:37 IST)
అమెరికాలో 12 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఔషధ దిగ్గజం ఫైజర్‌ శుక్రవారం యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ)కు దరఖాస్తు చేసింది. ప్రస్తుతం వ్యాక్సిన్‌ 16 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే అందుబాటులో ఉంది.

రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇతర నియంత్రణ సంస్థ నుంచి వ్యాక్సిన్‌ వినియోగ అనుమతులు పొందేందుకు దరఖాస్తు చేయనున్నట్లు ఫైజర్‌, జర్మనీకి చెందిన బయో ఎన్‌టెక్‌ కంపెనీలు తెలిపాయి.
 
రెండు కంపెనీలు ట్రయల్స్‌ ఫలితాలను ప్రకటించాయి. 12-15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో వ్యాక్సిన్ వందశాతం ప్రభావంతంగా పని చేస్తుందని వెల్లడించాయి. ఎటువంటి ప్రతికూల ప్రభావాలు నమోదు కాలేదని చెప్పాయి. 
 
టీకా వేసినప్పుడు పెద్దలు ఎలాంటి స్వల్ప అస్వస్థతకు గురయ్యారో?.. అంటే జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి చిన్న, చిన్న సమస్యలు తలెత్తాయని అందులోనూ రెండవ సారి టీకా తీసుకున్న సమయంలో ఇలాంటి ఫిర్యాదులు అందుకున్నట్లు తెలిపింది. ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ దీర్ఘకాలిక రక్షణ, భద్రత గురించి మరింత సమాచారం కోసం తమ అధ్యయనాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments