Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా సెకండ్ వేవ్: కరోనాతో 24 గంటల్లో 770 మంది మృతి

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (09:33 IST)
భారత్‌లో కరోనా మరింత ఉధృతం దాల్చింది. రోజుకో రికార్డుతో సెకండ్‌వేవ్‌ పీక్స్‌కు వెళ్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా లక్ష కేసుల మార్క్‌ దాటడమే కాకుండా.. లక్ష 50వేల కేసుల వైపు పరుగులు తీస్తోంది. ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా లక్ష 45వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కరోజులో ఇన్ని పాజిటివ్ కేసులు ఎప్పుడూ రికార్డు కాలేదు. కరోనాతో 24 గంటల్లో 770 మందికిపైగా చనిపోయారు.
 
అటు యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా రాకెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. దేశంలో ఇప్పటి వరకు నమోదుకాని యాక్టివ్‌ కేసులు ప్రస్తుతం ఇండియాలో ఉన్నాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 10 లక్షలు 46 వేలు దాటేసింది. గతేడాది సెప్టెంబర్‌లో 10 లక్షల 26 వేల యాక్టివ్‌ కేసులుండగా.. ఇప్పుడు ఆ రికార్డును చెరిపేసింది సెకండ్‌వేవ్‌.
 
కరోనా ఉగ్రరూపానికి మహారాష్ట్రతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఢిల్లీ అల్లాడిపోతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 11 వేలకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అటు ఉత్తర్‌ ప్రదేశ్‌లో దాదాపు 10 వేల పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. మరోవైపు ఢిల్లీలో కరోనా కోరలు విప్పింది. ఈ ఏడాదిలోనే రికార్డుస్థాయిలో 8 వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గతేడాది నవంబర్‌ 11 తర్వాత ఢిల్లీలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments