Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు రాష్ట్రాల్లో 34 రైళ్లు రద్దు.. ఎందుకో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో 34 రైళ్లు రద్దు.. ఎందుకో తెలుసా?
, శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (21:10 IST)
తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే రైళ్ళలో 34 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాజీపేట - బల్లార్‌షా సెక్షన్‌లో ఇంజనీరింగ్, పట్టాల మరమ్మతుల కారణంగా కొన్ని రోజుల పాటు 34 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. జరుగుతున్న మరమ్మతు పనుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రద్దయిన రైళ్ల రాకపోకల వివరాలను పరిశీలిస్తే, 
 
* సికింద్రాబాద్ ‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ రైలు (రైలునెంబర్‌ 02757), సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ (02758) రైలు ఏప్రిల్‌ 11 నుంచి ఏప్రిల్‌ 24వ తేదీ వరకు రద్దు అయ్యాయి.
 
* హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (07011)రైలు, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ - సికింద్రాబాద్‌ (07012)రైలు ఏప్రిల్‌ 17 నుంచి 24వ తేదీ వరకు రద్దు అయ్యాయి.
 
* సికింద్రాబాద్ ‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ( (07233) రైలు, సిర్పూర్‌ కాగజ్‌నగర్ ‌- సికింద్రాబాద్‌ (07234) రైలు ఏప్రిల్‌ 10 నుంచి 24 వరకు రద్దు అయ్యాయి.
 
* సికింద్రాబాద్ ‌- దానాపూర్‌ (02787) రైలు, దానాపూర్ ‌- సికింద్రాబాద్‌ (02788) రైలు ఏప్రిల్‌ 23, 24 వరకు రద్దు అయ్యాయి.
 
* గోరఖ్‌పూర్‌ - కొచ్చువేలి (02511) రైలు, కొచ్చువేలి - గోరఖ్‌పూర్‌ (02512) రైలు ఏప్రిల్‌ 11 నుంచి 21 వరకు రద్దు అయ్యాయి.
 
* తిరువనంతపురం సెంట్రల్‌ - హజ్రత్‌ నిజాముద్దీన్‌ (06167) రైలు ఏప్రిల్‌ 13, 20వ తేదీల్లో, నిజాముద్దీన్‌ - తిరువనంతపురం సెంట్రల్‌ (06168) రైలు ఏప్రిల్‌ 16, 23 తేదీల్లో రద్దు అయ్యాయి.
 
*  బరౌనీ - ఎర్నాకుళం (02521) రైలు, ఎర్నాకుళం - బరౌనీ (02552) రైలు ఏప్రిల్‌ 12 నుంచి 23వ తేదీ వరకు రద్దు అయ్యాయి.
 
* తిరునల్వేలి - శ్రీమాతా వైష్ణోదేవీ కాట్రా (06787) రైలు ఏప్రిల్‌ 12, 19 తేదీల్లో, శ్రీమాతా వైష్ణోదేవీ కాట్రా - తిరునల్వేలి (06788) రైలు ఏప్రిల్‌ 15,22 తేదీల్లో రద్దు అయ్యాయి.
 
* యశ్వంత్‌పూర్‌ - లక్నో (02683)రైలు, లక్నో - యశ్వంత్‌పూర్‌ (02684)రైలు ఏప్రిల్‌ 15, 22 తేదీల్లో రద్దు అయ్యాయి.
 
* గోరఖ్‌పూర్ ‌- యశ్వంత్‌పూర్‌ (05023) రైలు, యశ్వంత్‌పూర్‌ - గోరఖ్‌పూర్‌ (05024) రైలు ఏప్రిల్‌ 15, 22 తేదీల్లో రద్దు అయ్యాయి.
 
* కోయంబత్తూరు - హజ్రత్‌ నిజాముద్దీన్‌ (06077)రైలు, హజ్రత్‌ నిజాముద్దీన్ ‌- కొయంబత్తూరు (06078) రైలు ఏప్రిల్‌ 14,21 తేదీల్లో రద్దు అయ్యాయి.
 
* సికింద్రాబాద్‌-హజ్రత్‌ నిజాముద్దీన్‌ (02285) రైలు, హజ్రత్‌ నిజాముద్దీన్‌ - సికింద్రాబాద్‌ (02286) రైలు ఏప్రిల్‌ 23న రద్దు అయ్యాయి.
 
* చెన్నై - హజ్రత్‌ నిజాముద్దీన్‌ (06151) రైలు, హజ్రత్‌ నిజాముద్దీన్‌ - చెన్నై సెంట్రల్‌ (06152)రైలు ఏప్రిల్‌ 19న రద్దు అయ్యాయి.
 
* సికింద్రాబాద్‌ - దర్భంగా (07007) రైలు, దర్భంగా - సికింద్రాబాద్‌ (07008) రైలు ఏప్రిల్‌ 23న రద్దు అయ్యాయి.
 
* కోర్బా - కొచ్చువేలి (02647) రైలు ఏప్రిల్‌ 14,17,21,24 తేదీల్లో, కొచ్చువేలి - కోర్బా (02648) రైలు ఏప్రిల్‌ 12,15,19,22 తేదీల్లో రద్దు అయ్యాయి.
 
* హజ్రత్‌ నిజాముద్దీన్‌ - యశ్వంత్‌పూర్‌ (06250) రైలు ఏప్రిల్‌ 10,11,12,13,15,17,18,19, 20, 22 తేదీలలో రద్దు అయ్యింది.
 
* యశ్వంత్‌పూర్‌ - కోర్బా (02251) రైలు ఏప్రిల్‌ 9,16, 23 తేదీల్లో, కోర్బా - యశ్వంత్‌పూర్‌ (02252) రైలు ఏప్రిల్‌ 11,18, 25వ తేదీల్లో రద్దు అయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గన్నుకన్నా పెన్ను గొప్పది.. జగమంతటికీ జర్నలిస్టే బాధ్యుడు...