Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం : ధృవీకరించిన ప్రచంచ ఆరోగ్య సంస్థ

వరుణ్
గురువారం, 6 జూన్ 2024 (11:27 IST)
ప్రపంచంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం నమోదైంది. ఈ మృతి కేసు మెక్సికో దేశంలో నమోదైంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది. హెచ్ఎన్ 2 బర్డ్ ఫ్లూ వేరియంట్ బారిన పడిన స్థానికుడు ఒకరు (25) ఇటీవల మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, విరేచనాలు, కడుపులో తిప్పడం తదితర సమస్యలతో బాధపడ్డ రోగి ఏప్రిల్ 24వ తేదీన మృతిచెందాడు. బాధితుడు బర్డ్ ఫ్లూ బారిన పడ్డ విషయాన్ని మెక్సికో అధికారులు మే 23వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించారు.
 
రోగికి వ్యాధి ఎలా సోకిందనే దానిపై సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే, మెక్సికోలోని కోళ్లల్లో హెచ్ఎన్ఎ2 ఇన్ఫెక్షన్లు వెలుగు చూసినట్టు పేర్కొంది. అయితే, కోళ్ల నుంచి మనిషికి ఈ వ్యాధి ఎలా వ్యాపించిందో నిర్ధారించడం కష్టంగా మారిందని డబ్ల్యూహెచీ పేర్కొంది. ఇప్పటివరకూ ఈ వేరియంట్ మనుషులకు సోకడం దాదాపు అసాధ్యంగా భావించినట్టు పేర్కొంది.
 
మరోవైపు, అమెరికాలో బర్డ్ ఫ్లూకు చెందిన మరో వేరియంట్ వ్యాపిస్తోంది. పశువుల్లో ఈ వ్యాధి ప్రబలుతున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. కొందరు మనుషులు కూడా దీని బారినపడ్డట్టు తెలుస్తోంది. అయితే, ఇది రోగుల నుంచి ఇతరులకు వ్యాపిస్తోందనేందుకు ఇంతవరకూ ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని అధికారులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments