Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో అందరూ చూస్తుండగానే మహిళపై అత్యాచారం.. ఎంత అరిచినా 40 నిమిషాల పాటు..?

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (13:21 IST)
Train
అమెరికాలోని పెన్సిల్వినేయాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడు రైలులో అందరూ చూస్తుండగానే మహిళపై అత్యాచారం చేశాడు. చుట్టూ ఉన్న ప్రయాణికులు ఆ రేప్ ఘటనను చూస్తూ ఉండిపోయారు కాని అతడిని అడ్డుకోలేదు. ఆ మహిళ కాపాడండి అంటూ ఎంత అరుస్తున్నా వారిలో చలనం లేదు. ఈ ఘటన జరిగిన సమయంలో రైలులో పదుల కొద్ది జనాలు ఉన్నారు.
 
కానీ ఒక్కరు కూడా దారుణాన్ని ఆపలేకపోయారు. కనీసం ఎమర్జెన్సీ నంబర్‌కు కూడా కాల్‌ చేయలేదు. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు 69వ వీధి రవాణా కేంద్రం వైపు మార్కెట్-ఫ్రాంక్‌ఫోర్డ్ లైన్‌ మీదుగా రాత్రి పది గంటల ప్రాంతంలో రైలు ప్రయాణం చేస్తుంది. 
 
అదే ట్రైన్‌లో నిందితుడు ఫిస్టన్‌ ఎన్‌గోయ్‌ కూడా ఉన్నాడు. బాధితురాలి పక్కనే కూర్చుని ఉన్నాడు. పలుమార్లు ఆమెను అసభ్యకరంగా తాకాడు. ఆమె ప్రతిఘటించినప్పటికి అతడి తీరు మార్చుకోలేదు. ఆ సయమంలో ట్రైన్‌లో బాధితురాలితో పాటు కొద్ది మంది ప్రయాణికులు కూడా ఉన్నారు.
 
రైలులో ఉన్న ప్రయాణికులు ఫిస్టన్‌ అనుచిత చర్యలను చూస్తూ ఉన్నారే కానీ.. ఎవరు ముందుకు వచ్చి అతడిని వారించే ప్రయత్నం చేయలేదు. దాంతో మరింత రెచ్చిపోయిన ఫిస్టన్‌ ప్రయాణికులందరూ చూస్తుండగానే.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
తనను కాపాడాల్సిందిగా ఎంత ప్రాధేయపడినా.. ఎవరు ఆమెకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరకు రైల్వే ఉద్యోగులు కూడా ఆమెకు సాయం చేయలేదు. కనీసం ఎమర్జెన్సీ నంబర్‌కు కూడా కాల్‌ చేయలేదు.
 
40 నిమిషాల పాటు ఈ దారుణం జరిగింది. ఆ తర్వాత రైలులోకి వచ్చిన ఓ వ్యక్తి జరిగిన దారుణాన్ని గుర్తించి పోలీసులకు కాల్‌ చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఫిస్టన్‌ని అరెస్ట్‌ చేశారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments